నాగార్జునసాగర్ బరిలో జానారెడ్డి కొడుకు?

నాగార్జునసాగర్ బరిలో కాంగ్రెస్ సీనియర్ నేత జానారెడ్డి ఉంటారని అందరూ భావిస్తున్న సమయంలో ఆయన నిర్ణయం ఒక్కసారిగా ఆశ్చర్యపరిచింది. తన అనుచరులు, పార్టీ కార్యకర్తలు గనుక అంగీకరిస్తే తన కొడుకు రఘువీర్ రెడ్డిని నాగార్జునసాగర్ బరిలో దింపుతానని ప్రకటించారు. వారసత్వ రాజకీయాలకు తాను వ్యతిరేకమే.. కానీ పార్టీ, స్థానిక నాయకులు అంగీకరిస్తే రఘువీర్ పోటీ చేస్తాడని.. తన కొడుకు కాకపోయినా ఇంకా ఎవరి పేరు సూచించినా తనకు అభ్యంతరం లేదని ఆయన చెప్పారు. నాగార్జునసాగర్ బరిలో తానే […]

Advertisement
Update: 2021-01-30 02:12 GMT

నాగార్జునసాగర్ బరిలో కాంగ్రెస్ సీనియర్ నేత జానారెడ్డి ఉంటారని అందరూ భావిస్తున్న సమయంలో ఆయన నిర్ణయం ఒక్కసారిగా ఆశ్చర్యపరిచింది. తన అనుచరులు, పార్టీ కార్యకర్తలు గనుక అంగీకరిస్తే తన కొడుకు రఘువీర్ రెడ్డిని నాగార్జునసాగర్ బరిలో దింపుతానని ప్రకటించారు. వారసత్వ రాజకీయాలకు తాను వ్యతిరేకమే.. కానీ పార్టీ, స్థానిక నాయకులు అంగీకరిస్తే రఘువీర్ పోటీ చేస్తాడని.. తన కొడుకు కాకపోయినా ఇంకా ఎవరి పేరు సూచించినా తనకు అభ్యంతరం లేదని ఆయన చెప్పారు.

నాగార్జునసాగర్ బరిలో తానే నిలబడాలని బలంగా ఏమీ కోరుకోవట్లేదని.. ఇతరులు ఎవరికైనా ఆసక్తి ఉంటే వారికి అవకాశం ఇవ్వడానికి తాను సిద్దంగా ఉన్నానని చెప్పారు. పార్టీ అధిష్టానానికి ఇప్పటికే తాను బరిలో దిగనని స్పష్టం చేసినట్లు జానారెడ్డి చెప్పారు. అయితే నాగార్జునసాగర్ ఎన్నికలను ముందుండి నడిపించే బాధ్యతను మాత్రం తీసుకోనున్నట్లు జానారెడ్డి తెలిపారు.

గతంలో ఏడు సార్లు ఎమ్మెల్యేగా గెలిచిన జానారెడ్డి.. కాంగ్రెస్ హయాంలో హోం మంత్రిగా పని చేసిన అనుభవం ఉంది. ఇప్పుడు గనుక పోటీచేసి ఓడిపోతే రాబోయే రోజుల్లో తనకు సీఎం పదవి ఇబ్బందులు ఎదురవుతాయనే అనుమానంతోనే పోటీకి దూరంగా ఉంటున్నట్లు తెలుస్తున్నది. అదే సమయంలో కొడుకును ప్రత్యక్ష రాజకీయాల్లోకి దింపడానికి ఇదే సరైన సమయం అని కూడా జానారెడ్డి భావిస్తున్నారు. అందుకే అలాంటి ప్రకటన చేసినట్లు కాంగ్రెస్ పార్టీలో చర్చించుకుంటున్నారు.

Tags:    
Advertisement

Similar News