రజనీ ప్లేస్​లోకి విజయ్​? డిసెంబర్​ 31న ఏం జరగబోతోంది?

ఆరోగ్యం సహకరించడం లేదని… అందుకే తాను రాజకీయాల్లోకి రావడం లేదని తలైవా రజనీకాంత్​ మంగళవారం సంచలన ప్రకటన చేశారు. దీంతో ఆయన అభిమానులు, అనుచరులు తీవ్ర నైరాశ్యంలోకి వెళ్లిపోయారు. ఇటీవల రజనీ కాంత్ హైదరాబాద్​ అపోలోలో చేరగానే ఆయన పొలిటికల్​ ఎంట్రీపై కొంత స్తబ్దత నెలకొన్నది. తాజాగా అదే నిజమైంది. అయితే ఆయన రాజకీయాల్లోకి వస్తారని .. పెను మార్పులు తీసుకొస్తారని ఫ్యాన్స్​ ఆశగా ఎదురుచూశారు. కానీ రజనీ అనారోగ్యంతో వారి ఆశలు ఆవిరయ్యాయి. అయితే ఇప్పుడో […]

Advertisement
Update: 2020-12-29 07:55 GMT

ఆరోగ్యం సహకరించడం లేదని… అందుకే తాను రాజకీయాల్లోకి రావడం లేదని తలైవా రజనీకాంత్​ మంగళవారం సంచలన ప్రకటన చేశారు. దీంతో ఆయన అభిమానులు, అనుచరులు తీవ్ర నైరాశ్యంలోకి వెళ్లిపోయారు. ఇటీవల రజనీ కాంత్ హైదరాబాద్​ అపోలోలో చేరగానే ఆయన పొలిటికల్​ ఎంట్రీపై కొంత స్తబ్దత నెలకొన్నది. తాజాగా అదే నిజమైంది. అయితే ఆయన రాజకీయాల్లోకి వస్తారని .. పెను మార్పులు తీసుకొస్తారని ఫ్యాన్స్​ ఆశగా ఎదురుచూశారు. కానీ రజనీ అనారోగ్యంతో వారి ఆశలు ఆవిరయ్యాయి.

అయితే ఇప్పుడో కొత్త వార్త తెరమీదకు వచ్చింది. అదేమిటంటే రజనీ ప్లేస్​లోకి ఇలయ దళపతి విజయ్​ రానున్నారట. నిజానికి డిసెంబర్​ 31న రజనీకాంత్​ పార్టీని పెట్టాలనుకున్నారు. అయితే ఇప్పుడు అదే రోజు విజయ్​ పార్టీని పెడతారని తమిళనాట కొన్ని మీడియా సంస్థల్లో వార్తలు వస్తున్నాయి.

ఆదివారం రాత్రి విజయ్ సీఎం పళని స్వామిని రహస్యంగా కలిసాడు. కొన్నేళ్లుగా విజయ్ నటించిన సినిమాల విడుదల సమయంలో అన్నా డీఎంకే నేతలు ఏదో ఒక విధంగా అడ్డు పడుతున్నారు. విజయ్ సినిమాలు వచ్చినప్పుడల్లా వివాదాలు కామన్ అయ్యాయి. కానీ విజయ్.. పళని స్వామిని కలుసు కోవడంలో రాజకీయ కోణం ఏమైనా ఉందా అనే చర్చలు నడిచాయి. విజయ్​ తన మాస్టర్​ సినిమా విడుదల నేపథ్యంలోనే కలిశాడా? ఇంకా ఏదన్నా విశేషం ఉందా? అన్న విషయంపై క్లారిటీ లేదు.

మరోవైపు విజయ్​ ఇటీవల తన అభిమాన సంఘాల నాయకులతో రహస్యంగా భేటీ అయ్యారట. తమిళనాడులో రజనీకాంత్​ తర్వాత అంత మాస్​ ఫాలోయింగ్​ నటుడు విజయ్​. దీంతో ఆయన రాజకీయాల్లోకి రాబోతున్నారంటూ గత రెండేళ్లుగా వార్తలు వస్తున్నాయి. కానీ విజయ్​ మాత్రం క్లారిటీ ఇవ్వలేదు. అభిమాన సంఘాల నాయకులు విజయ్​ని రాజకీయాల్లోకి రావాలని చాలా కాలంగా ఫోర్స్​ చేస్తున్నా.. ఆయన మాత్రం అనువైన సమయం కోసం ఎదురుచూస్తున్నారట.

అయితే ఇటీవల విజయ్​ తండ్రి చంద్రశేఖర్​ ఓ పార్టీని ప్రకటించారు. దీన్ని కేంద్ర ఎన్నికల సంఘంలో రిజిస్టర్​ కూడా చేయించారు. విజయ్​ పొలిటికల్​ ఎంట్రీ ఖాయమైందన్న వార్తలు కూడా వచ్చాయి. అయితే విజయ్​ మీడియాకు ఈ విషయంపై క్లారిటీ ఇచ్చాడు. తన తండ్రి పొలిటికల్​ పార్టీతో తనకు ఏ విధమైన సంబంధం లేదని ఆయన చెప్పాడు.

మరోవైపు ‘విజయ్​ మక్కల్​ ఇయక్కమ్​’ (విజయ్​ అభిమాన సంఘం) నాయకులు ఈ పార్టీ కార్యకలాపాల్లో పాల్గొనొద్దని విజయ్​ సూచించారు. అయితే తాజాగా ఆయన విజయ్​ మక్కల్​ ఇయక్కమ్​ కీలక నాయకులతో రహస్యంగా భేటీ అయ్యారట.

ఈ సందర్భంగా ఆయన అభిమాన సంఘం నాయకులతో ‘త్వరలో నేను మీ అందరికి ఓ మంచి వార్త చెబుతా. అప్పటివరకు ఏ రాజకీయపార్టీలోనూ చేరకండి’ అని చెప్పారట. దీంతో విజయ్​ పొలిటికల్​ ఎంట్రీ ఖాయమన్న వార్తలు తమిళనాట వినిపించాయి. మరోవైపు రజనీ వెనక్కి తగ్గడంతో విజయ్​ ఆ స్థానాన్ని భర్తీ చేస్తారన్న ఊహాగానాలు మొదలయ్యాయి.

Advertisement

Similar News