జగన్ ను సీఎంగా తొలగించాలనడం అర్థరహితం...

ఏపీ సీఎం జగన్ ని పదవినుంచి తొలగించాలనే అభ్యర్థనకు అసలు విచారణ అర్హతే లేదని స్పష్టం చేశారు సుప్రీంకోర్టు జస్టిస్ సంజయ్ కిషన్ కౌల్. ఏపీ సీఎం జగన్ సీజేఐకి రాసిన లేఖపై దాఖలైన పిటిషన్లపై సుప్రీంకోర్టు త్రిసభ్య ధర్మాసనం విచారణ జరుపుతోంది. త్రిసభ్య ధర్మాసనంలో సభ్యులైన సంజయ్ కిషన్ కౌల్ విచారణ సందర్భంగా ఈ కీలక వ్యాఖ్యలు చేశారు. సుప్రీంకోర్టు జస్టిస్ సహా.. ఏపీ హైకోర్టు న్యాయమూర్తులపై ఆరోపణలు చేస్తూ సీఎం జగన్ సీజేఐకి లేఖ […]

Advertisement
Update: 2020-12-01 04:14 GMT

ఏపీ సీఎం జగన్ ని పదవినుంచి తొలగించాలనే అభ్యర్థనకు అసలు విచారణ అర్హతే లేదని స్పష్టం చేశారు సుప్రీంకోర్టు జస్టిస్ సంజయ్ కిషన్ కౌల్. ఏపీ సీఎం జగన్ సీజేఐకి రాసిన లేఖపై దాఖలైన పిటిషన్లపై సుప్రీంకోర్టు త్రిసభ్య ధర్మాసనం విచారణ జరుపుతోంది.

త్రిసభ్య ధర్మాసనంలో సభ్యులైన సంజయ్ కిషన్ కౌల్ విచారణ సందర్భంగా ఈ కీలక వ్యాఖ్యలు చేశారు. సుప్రీంకోర్టు జస్టిస్ సహా.. ఏపీ హైకోర్టు న్యాయమూర్తులపై ఆరోపణలు చేస్తూ సీఎం జగన్ సీజేఐకి లేఖ రాయడం, దానిని మీడియాకు బహిర్గతం చేయడం సరికాదని, ఇలా లేఖ రాసినందుకు ఆయనను సీఎం పదవినుంచి తొలగించాలనేది పిటిషనర్ల వాదన. అయితే ఈ వాదన సరికాదని, అసలు ఈ పిటిషన్ కు విచారణ అర్హతే లేదని తేల్చి చెప్పారు జస్టిస్ కిషన్ కౌల్.

ఈ సందర్భంగా ఇటీవల హైకోర్టు గ్యాగ్ ఆర్డర్ పై సుప్రీంకోర్టు స్టే విధించడాన్ని ఆయన గుర్తు చేశారు. సీఎం జగన్ లేఖలో ప్రస్తావించిన అంశాలకు అనుగుణంగానే అమరావతి భూముల కుంభకోణంపై సీఐడీ విచారణ మొదలు కావడం, ఆ విచారణపై హైకోర్టు గ్యాగ్ ఆర్డర్ ఇవ్వడం, గ్యాగ్ ఆర్డర్ పై సుప్రీం కోర్టు స్టే విధించడం తెలిసిందే.

గ్యాగ్ ఆర్డర్ ని సుప్రీంకోర్టు నిలువరించింది కాబట్టి.. అమరావతి భూముల కుంభకోణంపై సీఐడీ విచారణకు కూడా అడ్డంకి లేకుండా పోయింది. అదే సమయంలో అమరావతి భూముల కుంభకోణం, ఆ కుంభకోణంతో న్యాయమూర్తి కుమార్తెలకు ఉన్న సంబంధాన్ని వివరిస్తూ ఏపీ సీఎం రాసిన లేఖని కూడా తప్పుబట్టలేమన్నది సుప్రీంకోర్టు జస్టిస్ కిషన్ కౌల్ అభిప్రాయం.

అమరావతి భూముల కుంభకోణంపై ఉన్న గ్యాగ్ ఆర్డర్ ని సుప్రీం ఎత్తివేసిన తర్వాత సీఎం జగన్ పై చర్యలు తీసుకోవడం ఎలా సాధ్యమని ఆయన ప్రశ్నించారు. సీబీఐ దర్యాప్తు జరపాలా వద్దా అన్నది సీజేఐ పరిధిలోనిదని ఆయన స్పష్టం చేశారు. సీఎం జగన్ ను పదవి నుంచి తొలగించాలనే అభ్యర్థనకు విచారణార్హత లేదని, లేఖలోని అంశాలను ఇప్పటికే వేరే బెంచ్ పరిశీలిస్తోందని అన్నారు కిషన్ కౌల్.

Advertisement

Similar News