మద్దతిచ్చి తప్పు చేశామా...? జనసేనలో అంతర్మథనం...

బుజ్జగించారో, బతిమాలారో లేక తిరుపతి సీటు ఆశగా చూపించారో.. ఏదైతేనేం పవన్ కల్యాణ్ గ్రేటర్ బరిలోనుంచి పూర్తిస్థాయిలో తప్పుకుని బీజేపీకి అవకాశమిచ్చారు, మద్దతు ప్రకటించి తమ ఓట్లన్నీ బీజేపీకే అని తేల్చేశారు. కట్ చేస్తే… అసలు పవన్ కల్యాణ్ ని మద్దతివ్వాలని ఎవరడిగారు, జీహెచ్ఎంసీలో మాకు జనసేనతో పొత్తేంటి? బీజేపీ సింగిల్ గా సింహంలా పోటీ చేస్తోంది అంటూ.. బీజేపీ నాయకులు స్టేట్ మెంట్లు ఇస్తున్నారు. ఎంపీ అరవింద్ చేసిన వ్యాఖ్యలతో జనసైనికులు బాగా హర్ట్ అయ్యారని […]

Advertisement
Update: 2020-11-28 23:58 GMT

బుజ్జగించారో, బతిమాలారో లేక తిరుపతి సీటు ఆశగా చూపించారో.. ఏదైతేనేం పవన్ కల్యాణ్ గ్రేటర్ బరిలోనుంచి పూర్తిస్థాయిలో తప్పుకుని బీజేపీకి అవకాశమిచ్చారు, మద్దతు ప్రకటించి తమ ఓట్లన్నీ బీజేపీకే అని తేల్చేశారు.

కట్ చేస్తే… అసలు పవన్ కల్యాణ్ ని మద్దతివ్వాలని ఎవరడిగారు, జీహెచ్ఎంసీలో మాకు జనసేనతో పొత్తేంటి? బీజేపీ సింగిల్ గా సింహంలా పోటీ చేస్తోంది అంటూ.. బీజేపీ నాయకులు స్టేట్ మెంట్లు ఇస్తున్నారు.

ఎంపీ అరవింద్ చేసిన వ్యాఖ్యలతో జనసైనికులు బాగా హర్ట్ అయ్యారని తెలుస్తోంది. దీంతో ఎన్నికల తేదీ దగ్గరపడుతున్న వేళ.. గ్రేటర్ లో జనసేన-బీజేపీ పొత్తు వ్యవహారం మరోసారి రచ్చగా మారే అవకాశం కనిపిస్తోంది. సాక్షాత్తూ కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి పవన్ కల్యాణ్ తో భేటీ అయి సీట్ల విషయం తేల్చేశాక.. ఎంపీలు, ఎమ్మెల్యేలు ఇంకా వితండవాదం ఎందుకు చేస్తున్నారో జనసైనికులకు అర్థం కావడంలేదు.

ఏరుదాటాక తెప్ప తగలేసినట్టుగా… నామినేషన్లు, ఉపసంహరణలు అన్నీ పూర్తైన తర్వాత జనసేనతో మాకేంటి సంబంధం, తెలంగాణలో జనసేనకు ఉన్న బలమెంత? అని బీజేపీ నాయకులు లెక్కలు తీయడంతో తెలంగాణ జనసైనికులు కిందా మీదా అవుతున్నారు.
ఏకపక్షంగా 150సీట్లు బీజేపీకి ఇచ్చేయకుండా కనీసం నామమాత్రంగా సీట్లు తీసుకున్నా మరీ ఇంతగా అవమానం జరిగేది కాదని అనుకుంటున్నారు. ఇంతా చేసి తిరుపతి సీటుపై ఏమైనా క్లారిటీ వచ్చిందా అంటే అదీ లేదు. మూడు రోజులు వేచి చూస్తే కొద్దిసేపు టైమిచ్చి.. సీటుపై తేల్చి చెప్పకుండా పంపించేశారు.

బీజేపీ తమకు ఉపయోగపడనప్పుడు… తాము మాత్రం ఆ పార్టీకోసం ఎన్నిసార్లు త్యాగం చేయాలని మథనపడుతున్నారు జనసైనికులు. త్యాగాలు చేసింది చాలక… జనసేన బలమెంత అని వారితో మాటలు పడాల్సి వస్తున్నందుకు మరింతగా బాధపడుతున్నారు.

బీజేపీ నేతలు చేసిన వ్యాఖ్యలపై జనసైనికులు సోషల్ మీడియాలో పెడుతున్న పోస్టింగ్ లు చూస్తుంటే ఈ విషయం స్పష్టమవుతోంది.

జనసేన పొత్తు విషయంలో తెలంగాణ బీజేపీ నాయకులు చేసిన వ్యాఖ్యలపై పవన్ కల్యాణ్ స్పందిస్తారా లేదా అనేది ఇప్పుడు సస్పెన్స్ గా మారింది. పవన్ నోరు మెదపకపోతే మాత్రం జనసైనికులు బీజేపీపై కక్ష తీర్చుకునేందుకు సిద్ధమవుతారనడంలో ఎలాంటి సందేహం లేదు.

Advertisement

Similar News