సోషల్ మీడియాలో వైఎస్ జగన్ హవా

రాజకీయ నాయకులు నాలుగు కాలాల పాటు అధికారంలో ఉండాలంటే ప్రజాదరణ ముఖ్యం. అందు కోసం ప్రజా సంక్షేమ పథకాలు ప్రవేశ పెట్టి వారి ఆదరణను చూరగొంటారు. అయితే ప్రస్తుత ఇంటర్నెట్ కాలంలో ప్రజాదరణతో పాటు సోషల్ మీడియాలో కూడా టాప్‌లో ఉండటం ముఖ్యం. ఎంత మంది ఫాలోవర్లు ఉంటే మన మాటలను అంత త్వరగా ప్రజల్లోకి పంపవచ్చు. సోషల్ మీడియాలో అత్యంత ప్రజాదరణ కలిగిన రాజకీయ నేతగా మోదీ మొదటి నుంచి హవా కొనసాగిస్తున్నారు. అయితే తాజాగా […]

Advertisement
Update: 2020-11-24 00:34 GMT

రాజకీయ నాయకులు నాలుగు కాలాల పాటు అధికారంలో ఉండాలంటే ప్రజాదరణ ముఖ్యం. అందు కోసం ప్రజా సంక్షేమ పథకాలు ప్రవేశ పెట్టి వారి ఆదరణను చూరగొంటారు. అయితే ప్రస్తుత ఇంటర్నెట్ కాలంలో ప్రజాదరణతో పాటు సోషల్ మీడియాలో కూడా టాప్‌లో ఉండటం ముఖ్యం. ఎంత మంది ఫాలోవర్లు ఉంటే మన మాటలను అంత త్వరగా ప్రజల్లోకి పంపవచ్చు.

సోషల్ మీడియాలో అత్యంత ప్రజాదరణ కలిగిన రాజకీయ నేతగా మోదీ మొదటి నుంచి హవా కొనసాగిస్తున్నారు. అయితే తాజాగా ‘చెక్ బ్రాండ్స్’ అనే సంస్థ ఇచ్చిన నివేదికలో మోడీ అదే స్థానంలో కొనసాగుతుండగా.. ఏపీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి రెండో స్థానంలోనికి దూసుకొని వచ్చారు. ట్విట్టర్, ఫేస్‌బుక్, గూగుల్ సెర్చ్, యూట్యూబ్ సెర్చ్‌లలో జగన్ రెండో స్థానంలో నిలిచారు.

గత మూడు నెలల కాలానికి టాప్ పొలిటికల్ లీడర్స్‌కు చెందిన సోషల్ అకౌంట్లపై అధ్యయనం నిర్వహించారు. దాదాపు 10 కోట్ల ఆన్‌లైన్ ఇంప్రెషన్స్ ఆధారంగా ఈ నివేదిక రూపొందించారు. ఇందులో మోదీ 2,171 ట్రెండ్స్‌తో తొలి స్థానంలో ఉండగా.. వైఎస్ జగన్ 2,137 ట్రెండ్స్‌తో రెండో స్థానంలో ఉన్నారు.

దేశ ప్రధాని అయిన మోదీకి, ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌కు మధ్య కేవలం 34 ట్రెండ్స్ మాత్రమే తేడా ఉండటం గమనార్హం. ఈ మధ్య కాలంతో జగన్ చేపట్టిన సంక్షేమ పథకాలు, రాజధాని నిర్ణయాలు దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించాయి. దీంతో యావత్ భారత దేశంలో వైఎస్ జగన్ గురించి ఇంటర్నెట్‌లో సెర్చ్ చేసే వాళ్ల సంఖ్య పెరిగిందని.. అందుకే ఆయన రెండో స్థానంలో నిలిచారని నిపుణులు చెబుతున్నారు. ఇక వీరిద్దరి తర్వాతి స్థానంలో మమత బెనర్జీ, రాహుల్ గాంధీ, సోనియా గాంధీ ఉన్నారు.

Advertisement

Similar News