పనబాకకు టీడీపీ నేతల బుజ్జగింపులు... పోటీ నుంచి తప్పుకుంటారా?

తిరుపతి ఉప ఎన్నిక నోటిఫికేషన్‌ ఇంకా వెలువడలేదు. అయినప్పటికి ప్రధాన పార్టీలు మాత్రం ఎన్నికల వాతావరణాన్ని సృష్టిస్తున్నాయి. ఇప్పటికే వైసీపీ అభ్యర్ధి దాదాపు రెడీగా ఉన్నారు. టీడీపీ అభ్యర్థిగా పనబాక లక్ష్మి పేరును ప్రకటించారు. జనసేన, బీజేపీ ఢిల్లీ స్థాయిలో చర్చలు జరుపుతున్నాయి. అయితే ఇదే సమయంలో మరో చర్చ మొదలైంది. గత ఎన్నికల్లో టీడీపీ ఎంపీ అభ్యర్థిగా ఓడిన పనబాక లక్ష్మి ఈసారి పోటీ చేసేందుకు ముందుకు రావడం లేదట. తనను సంప్రదించకుండా అభ్యర్థిగా ప్రకటించడంపై […]

Advertisement
Update: 2020-11-24 05:38 GMT

తిరుపతి ఉప ఎన్నిక నోటిఫికేషన్‌ ఇంకా వెలువడలేదు. అయినప్పటికి ప్రధాన పార్టీలు
మాత్రం ఎన్నికల వాతావరణాన్ని సృష్టిస్తున్నాయి. ఇప్పటికే వైసీపీ అభ్యర్ధి దాదాపు రెడీగా ఉన్నారు. టీడీపీ అభ్యర్థిగా పనబాక లక్ష్మి పేరును ప్రకటించారు. జనసేన, బీజేపీ ఢిల్లీ స్థాయిలో చర్చలు జరుపుతున్నాయి. అయితే ఇదే సమయంలో మరో చర్చ మొదలైంది.

గత ఎన్నికల్లో టీడీపీ ఎంపీ అభ్యర్థిగా ఓడిన పనబాక లక్ష్మి ఈసారి పోటీ చేసేందుకు ముందుకు రావడం లేదట. తనను సంప్రదించకుండా అభ్యర్థిగా ప్రకటించడంపై ఆమె ఆవేదనగా ఉన్నారట. తాను పోటీకి రెడీగా లేనని ఇప్పటికే చంద్రబాబు కోటరీకీ చెప్పారట.‌

లోక్‌సభ ఎంపీ అభ్యర్థిగా పనబాక తప్పుకుంటే… తమకు అభ్యర్ధి‌ దొరకడం కష్టమని భావిస్తున్న టీడీపీ… ఆమెతో సంప్రదింపులు మొదలుపెట్టారట. ఇప్పటికే మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్‌ రెడ్డి పనబాక దంపతులతో ఓ రౌండ్ చర్చలు జరిపారు. పోటీలో ఉండాలని కోరారట. అయితే వారు ఒప్పుకోలేదని తెలుస్తోంది.

తెలుగుదేశం శ్రేణుల్లో మాత్రం మరో చర్చ నడుస్తోంది. చంద్రబాబు ఆడే డ్రామాలో భాగం కాకూడదని పనబాక లక్ష్మి పోటీ చేయడం లేదని అంటున్నారు. బీజేపీ తరపున బలమైన అభ్యర్థిని నిలబెట్టి… తమ పార్టీ తరపున వీక్‌ క్యాండిడేట్ ని‌ పెట్టడం చంద్రబాబుకు అలవాటు. బీజేపీకి దగ్గరయ్యేందుకు ఈ ఎత్తుగడలు వేస్తున్నారని కార్యకర్తలే అంటున్నారు. తిరుపతి ఉప ఎన్నిక సమయం నాటికి తెలుగుదేశం నుంచి చాలా మంది నేతలు జంప్‌ అయ్యేందుకు కూడా రెడీ అవుతున్నారట.

ఇటు కూతురు పెళ్లి పనుల్లో పనబాక దంపతులు బిజీగా ఉన్నారు. పెళ్లి పనులు పూర్తయిన తర్వాత చంద్రబాబుని కలిసి అసలు విషయం చెప్పనున్నారని… తాము పోటీ చేయాలంటే పార్టీ తరపున ఖర్చు చేయాలనేది వారి డిమాండ్‌గా… మరో ప్రచారమూ నడుస్తోంది.

మొత్తానికి టీడీపీలో పనబాక ప్రకంపనాలు మొదలయ్యాయి. అవి ఎటు దారితీస్తాయో చూడాలి.

Advertisement

Similar News