చిరిగిన బట్టలేసుకుని ఉద్యమం చేయాలా..? " పవన్ కల్యాణ్

రాజధాని వ్యవహారంలో తమ వ్యవహారంలో మార్పేమీ లేదని మరోసారి స్పష్టం చేశారు పవన్ కల్యాణ్. అమరావతి ఉద్యమ కార్యాచరణకే తమ సంపూర్ణ మద్దతు ఉంటుందని అన్నారు. అమరావతి పరిరక్షణ సమితి నేతలతో సమావేశమైన జనసేనాని.. వారికి తమ సంపూర్ణ మద్దతు ఉంటుందని భరోసా ఇచ్చారు. కోర్టులో అఫిడవిట్ అడిగినప్పుడు పార్టీ పక్షాన వేశామని చెప్పారు. ఢిల్లీ వెళ్లిన సందర్భంలో కూడా రైతులు, మహిళలపై జరుగుతున్న దాడుల గురించి, అమరావతి రైతులకు జరుగుతున్న అన్యాయం గురించి ఫొటోలతో సహా […]

Advertisement
Update: 2020-11-18 06:13 GMT

రాజధాని వ్యవహారంలో తమ వ్యవహారంలో మార్పేమీ లేదని మరోసారి స్పష్టం చేశారు పవన్ కల్యాణ్. అమరావతి ఉద్యమ కార్యాచరణకే తమ సంపూర్ణ మద్దతు ఉంటుందని అన్నారు.

అమరావతి పరిరక్షణ సమితి నేతలతో సమావేశమైన జనసేనాని.. వారికి తమ సంపూర్ణ మద్దతు ఉంటుందని భరోసా ఇచ్చారు. కోర్టులో అఫిడవిట్ అడిగినప్పుడు పార్టీ పక్షాన వేశామని చెప్పారు. ఢిల్లీ వెళ్లిన సందర్భంలో కూడా రైతులు, మహిళలపై జరుగుతున్న దాడుల గురించి, అమరావతి రైతులకు జరుగుతున్న అన్యాయం గురించి ఫొటోలతో సహా కేంద్ర నాయకత్వం దృష్టికి తీసుకెళ్లామని వారికి వివరించారు.

బీజేపీ నాయకత్వం కూడా అమరావతినే రాజధానిగా స్పష్టంగా చెప్పిందని అన్నారు పవన్ కల్యాణ్. బీజేపీ ఒక మాట ఇస్తే దానికి కట్టుబడి ఉంటుందని అన్నారు. రాజధానిని తరలిస్తున్నామని చెప్పకుండా ఉద్యమానికి వైసీపీ తూట్లు పొడుస్తోందని మండిపడ్డారు పవన్ కల్యాణ్. 365రోజుల్లో ఈ విషయం తేలిపోవాల్సిందేనని డెడ్ లైన్లు పెట్టుకోకుండా.. మనవంతుగా పోరాటం చేద్దామంటూ అమరావతి పరిరక్షణ సమితి నాయకులకు చెప్పారు పవన్.

జేఏసీ తమ డిమాండ్లను వినిపిస్తే.. బీజేపీ అగ్రనాయకత్వానికి తెలియజేస్తానని, ప్రధాని అపాయింట్ మెంట్ ఇప్పిస్తానని అన్నారు పవన్. అమరావతి ఉద్యమకారులపై వైసీపీ నేతల వ్యాఖ్యలు సరికావన్న పవన్ కల్యాణ్.. చిరిగిన బట్టలేసుకుని ఉద్యమం చేయాలా అని ప్రశ్నించారు. ఉద్యమ నేతలు బంగారం పెట్టుకున్నారని అనడం సరికాదన్నారు.

సమస్యలపై గొంతెత్తే ఓ బలమైన సమాజం కావాలని తాను కోరుకుంటున్నానని, తప్పులు జరిగినప్పుడు ఆ సమాజం ముందుకొచ్చి ప్రశ్నించాలని, ఉద్యమాన్ని లీడ్ చేయాలని అన్నారు పవన్. గతంలో తనను రాజధాని ప్రాంతానికి రమ్మని దళిత రైతులు పిలిచారని మా ఆంధ్రప్రదేశ్ కోసం మేము భూములు ఇస్తున్నాం అని వారు చెప్పారని, అందుకే వారి తరపున పోరాడి అప్పటి ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చి పరిహారం పెంచేలా చేశామని అన్నారు.

ప్రభుత్వం మారింది కాబట్టి, రాజధాని మారుస్తామంటే కుదరదని, రాజధాని కేవలం ఒక కులానికి చెందింది అని అప్పట్లోనే జగన్ చెబితే బాగుండేదని, అధికారంలోకి వచ్చాక రాజధానికి కులాన్ని ఆపాదిస్తున్నారని మండిపడ్డారు. తాను కూడా తెలివిగా చొక్కా నలగకుండా మాట్లాడగలనని, అయితే ప్రజల పక్షాన నిజంగా పోరాటం చేయాలనే ఉద్దేశం ఉంది కాబట్టే.. చెప్పులు తెగినా, ముళ్లకంచెలు దాటుకుని మరీ ఉద్యమంకోసం రోడ్డుపై కూర్చున్నానని గుర్తు చేశారు.

మొత్తమ్మీద జనసేనతోపాటు బీజేపీ కేంద్ర నాయకత్వం కూడా అమరావతికి కట్టుబడి ఉందని మరోసారి స్పష్టం చేశారు పవన్.

Advertisement

Similar News