సోమవారం నుంచి సెట్స్ పైకి చిరు

చిరంజీవికి కరోనా లేదని తేలిపోయింది. దీంతో దర్శకుడు కొరటాల శివ ఊపిరి పీల్చుకున్నాడు. ఇప్పటికే చాలా ఆలస్యమైందనుకున్న ఆచార్య సినిమా, చిరంజీవికి కరోనా రావడంతో ఇంకా ఆలస్యం అవుతుందని అంతా అనుకున్నారు. కానీ అనూహ్యంగా చిరంజీవికి పాజిటివ్ రాలేదని తేలడంతో కొరటాల ఉబ్బితబ్బిబ్బవుతున్నాడు. కొరటాల ఆనందాన్ని మరింత రెట్టింపు చేస్తూ.. సోమవారం నుంచి సెట్స్ పైకి వస్తున్నాడు చిరంజీవి. సినిమాకు సంబంధించి ఆల్రెడీ షెడ్యూల్ మొదలైంది. ఇప్పుడు చిరంజీవి రాకతో షూటింగ్ మరింత ఊపందుకుంటుంది. ఈ సినిమాలో […]

Advertisement
Update: 2020-11-14 01:32 GMT

చిరంజీవికి కరోనా లేదని తేలిపోయింది. దీంతో దర్శకుడు కొరటాల శివ ఊపిరి పీల్చుకున్నాడు. ఇప్పటికే చాలా ఆలస్యమైందనుకున్న ఆచార్య సినిమా, చిరంజీవికి కరోనా రావడంతో ఇంకా ఆలస్యం అవుతుందని అంతా అనుకున్నారు. కానీ అనూహ్యంగా చిరంజీవికి పాజిటివ్ రాలేదని తేలడంతో కొరటాల ఉబ్బితబ్బిబ్బవుతున్నాడు.

కొరటాల ఆనందాన్ని మరింత రెట్టింపు చేస్తూ.. సోమవారం నుంచి సెట్స్ పైకి వస్తున్నాడు చిరంజీవి. సినిమాకు సంబంధించి ఆల్రెడీ షెడ్యూల్ మొదలైంది. ఇప్పుడు చిరంజీవి రాకతో షూటింగ్ మరింత ఊపందుకుంటుంది.

ఈ సినిమాలో హీరోయిన్ గా నటిస్తున్న కాజల్, ప్రస్తుతం మాల్దీవుల్లో హనీమూన్ లో ఉంది. మరో కీలక పాత్ర పోషించాల్సిన రామ్ చరణ్, ప్రస్తుతం ఆర్ఆర్ఆర్ షూటింగ్ లో బిజీగా ఉన్నాడు. వీళ్లిద్దరూ ఈ నెలాఖరుకు ఆచార్య సెట్స్ పైకి వచ్చేస్తారు. నెల రోజుల పాటు జరిగే ఈ షెడ్యూల్ కంప్లీట్ అయిన తర్వాత రిలీజ్ డేట్ పై ఓ క్లారిటీ వస్తుంది.

Advertisement

Similar News