సమంత... కొత్త రకం ఎక్సర్ సైజులు

హీరోయిన్లంతా ఎక్సర్ సైజులు చేస్తారు. కానీ వ్యాయామం అనగానే ఫస్ట్ గుర్తొచ్చే పేరు సమంత. పొద్దున్న లేవగానే వ్యాయామం చేయకపోతే ఈ ముద్దుగుమ్మకు రోజు గడవదు. ఎప్పటికప్పుడు తన జిమ్ ఫొటోలు, వీడియోల్ని ఆమె షేర్ చేస్తుంటుంది కూడా. హెవీ వెయిట్ లిఫ్టర్ లా వంద కిలోల బరువు ఎత్తిన సందర్భం కూడా ఉంది. ఇప్పుడీ అక్కినేని కోడలు మరో వీడియో పెట్టింది. నిత్యం జిమ్ లో కసరత్తులు చేసే సమంత, ఈసారి అలాంటివేం లేకుండా గార్డెన్ […]

Advertisement
Update: 2020-11-10 21:48 GMT

హీరోయిన్లంతా ఎక్సర్ సైజులు చేస్తారు. కానీ వ్యాయామం అనగానే ఫస్ట్ గుర్తొచ్చే పేరు సమంత. పొద్దున్న లేవగానే వ్యాయామం చేయకపోతే ఈ ముద్దుగుమ్మకు రోజు గడవదు. ఎప్పటికప్పుడు తన జిమ్ ఫొటోలు, వీడియోల్ని ఆమె షేర్ చేస్తుంటుంది కూడా. హెవీ వెయిట్ లిఫ్టర్ లా వంద కిలోల బరువు ఎత్తిన సందర్భం కూడా ఉంది. ఇప్పుడీ అక్కినేని కోడలు మరో వీడియో పెట్టింది.

నిత్యం జిమ్ లో కసరత్తులు చేసే సమంత, ఈసారి అలాంటివేం లేకుండా గార్డెన్ లోకి వచ్చింది. కొత్త రకం ఎక్సర్ సైజులు చేసింది. రీసెంట్ గా ప్లాంట్ బేస్డ్ డైట్, వ్యాయామం స్టార్ట్ చేసింది సమంత. అందులో భాగంగా చేసిందే ఈ వ్యాయామం.

ఈ ప్రొగ్రామ్ లో ఇది కేవలం రెండో రోజు మాత్రమే. ఇలా ఇంకెన్ని రోజులు ఈమె కష్టపడతుందో అంటూ రియాక్ట్ అవుతున్నారు నెటిజన్లు.

ఓవైపు యాంకరింగ్, మరోవైపు వ్యాయామాలు, ఇంకోవైపు టెర్రస్ గార్డెనింగ్, అటు వ్యాపారంతో బిజీగా ఉన్న సమంత.. తన సినిమా అప్ డేట్స్ మాత్రం ఇవ్వడం లేదు. ఆ అప్ డేట్ కూడా ఇస్తే ఫ్యాన్స్ ఫుల్ ఖుషీ.

https://www.instagram.com/p/CHZUkhshQgR/

Advertisement

Similar News