నిమ్మగడ్డ వెనక్కు తగ్గారా?

స్థానిక సంస్థల ఎన్నికలపై నిమ్మగడ్డ రమేష్ కుమార్ కాస్త మెత్తబడ్డారు. ఎన్నికల నిర్వాహణ సాధ్యం కాదని నిమ్మగడ్డను కలిసి సీఎస్ నీలం సాహ్ని స్పష్టం చేశారు. ఈసీతో భేటీ సందర్భంగా టీడీపీ మినహా మిగిలిన అన్ని రాజకీయ పార్టీలు కరోనా విషయంలో వైద్య నిపుణుల నుంచి సలహా తీసుకుని, ప్రభుత్వంతో సంప్రదించిన తర్వాతే ముందుకెళ్లాలని సూచించాయి. దాంతో నిమ్మగడ్డ కాస్త వెనక్కు తగ్గారు. తనను సీఎస్ కలిసిన సందర్భంగా నిమ్మగడ్డ రమేష్ కుమార్‌ తానూ ఇప్పుడే ఎన్నికలు […]

Advertisement
Update: 2020-10-28 23:38 GMT

స్థానిక సంస్థల ఎన్నికలపై నిమ్మగడ్డ రమేష్ కుమార్ కాస్త మెత్తబడ్డారు. ఎన్నికల నిర్వాహణ సాధ్యం కాదని నిమ్మగడ్డను కలిసి సీఎస్ నీలం సాహ్ని స్పష్టం చేశారు.

ఈసీతో భేటీ సందర్భంగా టీడీపీ మినహా మిగిలిన అన్ని రాజకీయ పార్టీలు కరోనా విషయంలో వైద్య నిపుణుల నుంచి సలహా తీసుకుని, ప్రభుత్వంతో సంప్రదించిన తర్వాతే ముందుకెళ్లాలని సూచించాయి. దాంతో నిమ్మగడ్డ కాస్త వెనక్కు తగ్గారు.

తనను సీఎస్ కలిసిన సందర్భంగా నిమ్మగడ్డ రమేష్ కుమార్‌ తానూ ఇప్పుడే ఎన్నికలు జరపాలనుకోవడం లేదని చెప్పారు. ఎన్నికల నిర్వాహణపై నవంబర్‌ 4న హైకోర్టులో అఫిడవిట్ దాఖలుచేయాల్సి ఉందని… అందుకే తాను రాజకీయ పార్టీల నుంచి అభిప్రాయాలు తెలుసుకునేందుకు ప్రయత్నించినట్టు వివరించారు.

ఎన్నికలపై తొందరపడి నిర్ణయం తీసుకోబోమని నిమ్మగడ్డ చెప్పారు. నిమ్మగడ్డ వ్యాఖ్యలను బట్టి ఆయన తాత్కాలికంగా ఎన్నికలపై వెనక్కు తగ్గినట్టు భావిస్తున్నారు.

Advertisement

Similar News