ఎమ్మెల్సీ ఎన్నికల్లో కవిత ఘనవిజయం

నిజామాబాద్ స్థానిక సంస్థల కోటాలో జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికల్లో మాజీ ఎంపీ, కేసీఆర్ తనయ కల్వకుంట్ల కవిత ఘనవిజయం సాధించారు. స్థానిక సంస్థల్లో మొత్తం 823 ఓట్లు ఉండగా టీఆర్ఎస్‌కు 728 ఓట్లు లభించాయి. బీజేపీ అభ్యర్థి లక్ష్మీనారాయణకు 56 ఓట్లు, కాంగ్రెస్‌ అభ్యర్థి సుభాష్ రెడ్డికి 29 ఓట్లు మాత్రమే దక్కడంతో డిపాజిట్లు కోల్పోయారు. మొత్తం ఓట్లలో 10 చెల్లని ఓట్లు కూడా ఉన్నట్లు అధికారులు వెల్లడించారు. సోమవారం ఉదయం ఇందూర్ ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాల […]

Advertisement
Update: 2020-10-12 03:41 GMT

నిజామాబాద్ స్థానిక సంస్థల కోటాలో జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికల్లో మాజీ ఎంపీ, కేసీఆర్ తనయ కల్వకుంట్ల కవిత ఘనవిజయం సాధించారు.

స్థానిక సంస్థల్లో మొత్తం 823 ఓట్లు ఉండగా టీఆర్ఎస్‌కు 728 ఓట్లు లభించాయి. బీజేపీ అభ్యర్థి లక్ష్మీనారాయణకు 56 ఓట్లు, కాంగ్రెస్‌ అభ్యర్థి సుభాష్ రెడ్డికి 29 ఓట్లు మాత్రమే దక్కడంతో డిపాజిట్లు కోల్పోయారు. మొత్తం ఓట్లలో 10 చెల్లని ఓట్లు కూడా ఉన్నట్లు అధికారులు వెల్లడించారు.

సోమవారం ఉదయం ఇందూర్ ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాల మైదానంలో ఓట్ల లెక్కింపు ప్రారంభించారు. మొత్తం రెండు రౌండ్లలో ఓట్ల లెక్కింపు నిర్వహించాల్సి ఉండగా.. తొలి రౌండ్‌లోనే కవిత విజయం ఖరారైంది. జిల్లా కలెక్టర్ నారాయణ రెడ్డి, పరిశీలకులు వీర బ్రహ్మయ్య కౌంటింగ్ సరళిని పరిశీలించారు.

ఇక కవిత విజయం సాధించడంతో టీఆర్ఎస్ శ్రేణులు సంబురాల్లో మునిగిపోయాయి. బాణసంచా పేలుస్తూ.. స్వీట్లు పంచుతూ నగరంలో సందడి చేశారు. తన విజయానికి తోడ్పడిన అందరికీ కవిత కృతజ్ఞతలు తెలిపారు. ఈనెల 14న కవిత ఎమ్మెల్సీగా ప్రమాణస్వీకారం చేస్తారు.

Advertisement

Similar News