గన్నవరం పంచాయతీకి చెక్‌పెట్టిన జగన్.... వంశీ, యార్లగడ్డ కలిసి పనిచేస్తారా ?

కృష్ణా జిల్లా గన్నవరం నియోజకవర్గం ఎమ్మెల్యే వల్లభనేని వంశీ. టీడీపీ నుంచి గెలిచిన ఈయన ఆతర్వాత వైసీపీకి దగ్గరయ్యారు. టీడీపీ అధినేత చంద్రబాబుపై విమర్శలతో విరుచుకుపడుతున్నారు. అయితే గత ఎన్నికల్లో వైసీపీ తరపున పోటీ చేసిన యార్లగడ్డ వెంకట్రావుకి వంశీ రాకతో ఉక్కపోత మొదలైంది. ఈయన అసమ్మతి స్వరం వినిపిస్తూ వచ్చారు. అయితే ఈ మధ్య గన్నవరంలో యార్లగడ్డ దూకుడు పెంచారు. వంశీపై విమర్శల దాడి మొదలుపెట్టారు. వీరిద్దరి మధ్య సఖ్యత లేకుండా పోయింది. ఈ ఇద్దరూ […]

Advertisement
Update: 2020-10-08 20:42 GMT

కృష్ణా జిల్లా గన్నవరం నియోజకవర్గం ఎమ్మెల్యే వల్లభనేని వంశీ. టీడీపీ నుంచి గెలిచిన ఈయన ఆతర్వాత వైసీపీకి దగ్గరయ్యారు. టీడీపీ అధినేత చంద్రబాబుపై విమర్శలతో విరుచుకుపడుతున్నారు. అయితే గత ఎన్నికల్లో వైసీపీ తరపున పోటీ చేసిన యార్లగడ్డ వెంకట్రావుకి వంశీ రాకతో ఉక్కపోత మొదలైంది. ఈయన అసమ్మతి స్వరం వినిపిస్తూ వచ్చారు.

అయితే ఈ మధ్య గన్నవరంలో యార్లగడ్డ దూకుడు పెంచారు. వంశీపై విమర్శల దాడి మొదలుపెట్టారు. వీరిద్దరి మధ్య సఖ్యత లేకుండా పోయింది. ఈ ఇద్దరూ ఇప్పటి వరకు ఎదురుపడింది లేదు. కలిసింది లేదు. కానీ ఇప్పుడా ఇద్దరు నేతల మధ్య గ్యాప్‌ను ఒకే ఒక్క క్షణంలో దూరం చేసేశారు ముఖ్యమంత్రి జగన్‌. వల్లభనేని వంశీ, యార్గగడ్డ వెంకట్రావు చేతులు కలిపారు.

జగనన్న విద్యా కానుక ప్రారంభోత్సవం కోసం కృష్ణా జిల్లాలో సీఎం జగన్‌ పర్యటించారు. పెనమలూరు నియోజకవర్గం పునాదిపాడు ప్రభుత్వ స్కూల్‌ దగ్గర సీఎం జగన్‌కు స్వాగతం పలికేందుకు ఇద్దరు నేతలు వచ్చారు. దూరంగా దూరంగా ఉన్నారు. యార్లగడ్డ వెంకట్రావు సీఎంకు నమస్కారం చేశారు. వెంటనే పక్కనే ఉన్న వల్లభనేని వంశీని పిలిచిన జగన్‌…. ఆ ఇద్దరి చేతులు కలిపారు. నియోజకవర్గంలోకలిసి పని చేసుకోవాలని సంకేతాలు పంపారు. యార్లగడ్డ పొట్ట మీద చేతులు వేసి మరీ… కలిసి పని చేసుకోవాలని సూచించారు . ఒక్కసారిగా జగన్‌ ఇచ్చిన రియాక్షన్‌తో అక్కడ ఉన్న వారంతా సంతోషం వ్యక్తం చేశారు.

ఇప్పుడు సీఎం జగనే స్వయంగా ఈ ఇద్దరి చేతులు కలపడంతో గన్నవరంలో ఈ రెండు గ్రూపుల మధ్య సయోధ్య కుదిరినట్లేనని భావిస్తున్నారు నేతలు. మరో గ్రూపు అయిన దుట్టా రామచంద్రరావు సైతం వంశీ తీరుపై అసంతృప్తిగా ఉన్నారు. మరి వారి మధ్య ఎలాంటి సయోధ్య కుదురుస్తారో చూడాలి.

Advertisement

Similar News