మొన్న జెఠ్మలానీ... నిన్న టేలర్

నిజమే.. పెళ్లి చేసుకుంటే హీరోయిన్లకు అవకాశాలు తగ్గిపోతాయి. అందుకే పెళ్లి విషయాన్ని హీరోయిన్లు సీక్రెట్ గా దాస్తుంటారు. కానీ ఇప్పుడు పరిస్థితిలో మార్పు వచ్చింది. పెళ్లయినప్పటికీ సమంత లాంటి హీరోయిన్లు క్రేజ్ తో దూసుకుపోతున్నారు. ఇలాంటి టైమ్ లో కూడా తన పెళ్లిని రహస్యంగా దాచింది హీరోయిన్ నితి టేలర్. తెలుగులో ఒకట్రెండు సినిమాలు చేసిన ఈ హీరోయిన్ సీక్రెట్ గా పెళ్లి చేసుకుంది. ఆ పెళ్లి విషయాన్ని తాజాగా బయటపెట్టింది. టేలర్ పెళ్లి చేసుకున్న వ్యక్తి […]

Advertisement
Update: 2020-10-08 03:43 GMT

నిజమే.. పెళ్లి చేసుకుంటే హీరోయిన్లకు అవకాశాలు తగ్గిపోతాయి. అందుకే పెళ్లి విషయాన్ని హీరోయిన్లు సీక్రెట్ గా దాస్తుంటారు. కానీ ఇప్పుడు పరిస్థితిలో మార్పు వచ్చింది. పెళ్లయినప్పటికీ సమంత లాంటి హీరోయిన్లు క్రేజ్ తో దూసుకుపోతున్నారు. ఇలాంటి టైమ్ లో కూడా తన పెళ్లిని రహస్యంగా దాచింది హీరోయిన్ నితి టేలర్.

తెలుగులో ఒకట్రెండు సినిమాలు చేసిన ఈ హీరోయిన్ సీక్రెట్ గా పెళ్లి చేసుకుంది. ఆ పెళ్లి విషయాన్ని తాజాగా బయటపెట్టింది. టేలర్ పెళ్లి చేసుకున్న వ్యక్తి ఓ ఆర్మీ మేజర్. తను పెళ్లి విషయాన్ని ఎందుకు దాచానో తనకు కూడా తెలియదంటూ ఓ స్టేట్ మెంట్ పడేసింది నీతి టేలర్.

ఇంతకుముందు కామ్న జెఠ్మలానీ కూడా ఇలానే చేసింది. పెళ్లయితే అవకాశాలు తగ్గిపోతాయని భావించి పెళ్లి విషయాన్ని దాచింది. బెంగళూరులో కాపురం పెట్టి హైదరాబాద్ కు అప్ అండ్ డౌన్ చేసింది. కానీ తనకు అవకాశాలు తగ్గడంతో పెళ్లి మేటర్ ను బయటపెట్టింది. ఇప్పుడు నీతి టేలర్ కూడా అదే పనిచేసింది.

Advertisement

Similar News