లవకుశ నాగరాజు కన్నుమూత

లవకుశ సినిమాలో నటించిన నాగరాజు కన్నుమూశారు. లవకుశ సినిమాలో నాగరాజు లవుడి పాత్ర పోషించారు. కొద్దికాలంగా ఆయన శ్వాససంబంధిత జబ్బుతో బాధపడుతున్నారు. హైద‌రాబాద్‌లోని గాంధీన‌గ‌ర్‌లో ఉన్న త‌న నివాసంలో తుదిశ్వాస విడిచారు.. 1963 మార్చిలో లవకుశ విడుదలైంది. ఆ సినిమాలో లవకుశుల పాత్రలు హైలైట్‌గా నిలిచాయి. ఈ సినిమా చిత్రీకరణ అప్పట్లో అనేక కారణాల వల్ల ఐదేళ్లు పట్టింది. సి పుల్లయ్య ఈ చిత్రానికి దర్శకత్వం వహించారు. ఈ చిత్రంలో లవుడిగా నాగరాజు నటించగా… కుశుడిగా సుబ్రమణ్యం […]

Advertisement
Update: 2020-09-07 00:04 GMT

లవకుశ సినిమాలో నటించిన నాగరాజు కన్నుమూశారు. లవకుశ సినిమాలో నాగరాజు లవుడి పాత్ర పోషించారు. కొద్దికాలంగా ఆయన శ్వాససంబంధిత జబ్బుతో బాధపడుతున్నారు. హైద‌రాబాద్‌లోని గాంధీన‌గ‌ర్‌లో ఉన్న త‌న నివాసంలో తుదిశ్వాస విడిచారు.. 1963 మార్చిలో లవకుశ విడుదలైంది. ఆ సినిమాలో లవకుశుల పాత్రలు హైలైట్‌గా నిలిచాయి.

ఈ సినిమా చిత్రీకరణ అప్పట్లో అనేక కారణాల వల్ల ఐదేళ్లు పట్టింది. సి పుల్లయ్య ఈ చిత్రానికి దర్శకత్వం వహించారు. ఈ చిత్రంలో లవుడిగా నాగరాజు నటించగా… కుశుడిగా సుబ్రమణ్యం నటించారు.

Advertisement

Similar News