పేదల ఇళ్ల స్థలాలకు అంగీకరించకపోతే అమరావతి నుంచి చట్టసభలు కూడా తొలగించాలి " కొడాలి నాని

మంత్రి కొడాలి నాని సంచలన వ్యాఖ్యలు చేశారు. అమరావతిలో బడుగు, బలహీన వర్గాలకు, పేదలకు ఇళ్ల స్థలాలు ఇవ్వడానికి వీల్లేదంటూ వాదిస్తున్న టీడీపీ, అమరావతి జేఏసీపై కొడాలి ఫైర్ అయ్యారు. పేదలు ఉండడానికి వీలు లేదన్న దుర్మార్గమైన ఆలోచన ఉన్న చోట చట్టసభలు కూడా ఉంచడానికి వీల్లేదని వ్యాఖ్యానించారు. ఒక చానల్‌ వద్ద ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. కోర్టులు గానీ, అమరావతి జేఏసీ గానీ, చంద్రబాబునాయుడు గానీ.. రాజధానిలో పేదలకు ఇళ్ల స్థలాలు ఇవ్వకూడదు అని […]

Advertisement
Update: 2020-08-25 07:28 GMT

మంత్రి కొడాలి నాని సంచలన వ్యాఖ్యలు చేశారు. అమరావతిలో బడుగు, బలహీన వర్గాలకు, పేదలకు ఇళ్ల స్థలాలు ఇవ్వడానికి వీల్లేదంటూ వాదిస్తున్న టీడీపీ, అమరావతి జేఏసీపై కొడాలి ఫైర్ అయ్యారు.

పేదలు ఉండడానికి వీలు లేదన్న దుర్మార్గమైన ఆలోచన ఉన్న చోట చట్టసభలు కూడా ఉంచడానికి వీల్లేదని వ్యాఖ్యానించారు. ఒక చానల్‌ వద్ద ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.

కోర్టులు గానీ, అమరావతి జేఏసీ గానీ, చంద్రబాబునాయుడు గానీ.. రాజధానిలో పేదలకు ఇళ్ల స్థలాలు ఇవ్వకూడదు అని చెబితే అలాంటి దుర్మార్గమైన ఆలోచన ఉన్న ప్రాంతంలో చట్టసభలు కూడా ఉంచడానికి వీల్లేదని కొడాలి నాని చెప్పారు.

పేదలకు అమరావతిలో ఇళ్ల స్థలాలు ఇవ్వకూడదు అన్నదే కోర్టు తీర్పు అయితే, అదే అమరావతి జేఏసీ, చంద్రబాబు వాదన అయితే… తాను సీఎంను బడుగు, బలహీన వర్గాల తరపున కలిసి… ఈ ప్రాంతం నుంచే వచ్చిన వ్యక్తిగా… ఇలాంటి దుర్మార్గమైన ఆలోచన ఉన్న ప్రాంతంలో చట్టసభలను కూడా ఉంచడానికి వీల్లేదని చెబుతానని ప్రకటించారు.

Advertisement

Similar News