రేవంత్‌ రెడ్డిపై స్వామిగౌడ్ ప్రశంసలు

ఒకప్పుడు కేసీఆర్‌కు సన్నిహితంగా ఉండడంతో ఆయన ఆశీస్సులతో మండలి చైర్మన్‌గా పనిచేసిన స్వామిగౌడ్ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు చర్చనీయాంశమయ్యాయి. తనను టీఆర్‌ఎస్ నాయకత్వం పట్టించుకోవడం లేదన్న అసంతృప్తి కారణమో, మరొకటో గానీ పరోక్షంగా టీఆర్‌ఎస్‌ నేతలపై విమర్శలు చేశారు. అదే సమయంలో టీఆర్‌ఎస్‌కు బద్ధశత్రువుగా ఉన్న రేవంత్ రెడ్డిపై ప్రశంసలు కురించారు. ఆదివారం బోయిన్‌పల్లిలో జరిగిన సర్దార్ సర్వాయిపాపన్న విగ్రహావిష్కరణకు రేవంత్ రెడ్డితోపాటు స్వామిగౌడ్ హాజరయ్యారు. ఈసందర్భంగా మాట్లాడిన స్వామి గౌడ్‌… తెల్లబట్టలోళ్లకు అమ్ముడుపోవద్దని నేతలకు సూచించారు. […]

Advertisement
Update: 2020-08-23 23:18 GMT

ఒకప్పుడు కేసీఆర్‌కు సన్నిహితంగా ఉండడంతో ఆయన ఆశీస్సులతో మండలి చైర్మన్‌గా పనిచేసిన స్వామిగౌడ్ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు చర్చనీయాంశమయ్యాయి. తనను టీఆర్‌ఎస్ నాయకత్వం పట్టించుకోవడం లేదన్న అసంతృప్తి కారణమో, మరొకటో గానీ పరోక్షంగా టీఆర్‌ఎస్‌ నేతలపై విమర్శలు చేశారు. అదే సమయంలో టీఆర్‌ఎస్‌కు బద్ధశత్రువుగా ఉన్న రేవంత్ రెడ్డిపై ప్రశంసలు కురించారు.

ఆదివారం బోయిన్‌పల్లిలో జరిగిన సర్దార్ సర్వాయిపాపన్న విగ్రహావిష్కరణకు రేవంత్ రెడ్డితోపాటు స్వామిగౌడ్ హాజరయ్యారు. ఈసందర్భంగా మాట్లాడిన స్వామి గౌడ్‌… తెల్లబట్టలోళ్లకు అమ్ముడుపోవద్దని నేతలకు సూచించారు. రెడ్డి కులంలో పుట్టినప్పటికీ రేవంత్ రెడ్డి బడుగుబలహీన వర్గాలకు వెన్నుపూసలా, బలమైన చేతి కర్రలా నిలబడుతున్నారని కితాబిచ్చారు. బడుగుబలహీన వర్గాలకు అండగా నిలిచిన వారికే మద్దతు ఇవ్వాలని కోరారు. కొందరు నాయకులుగా తయారై , తెల్ల బట్టలు వేసుకుని వెంటనే అమ్ముడుపోతామంటూ బోర్డు పెట్టుకుంటున్నారని స్వామిగౌడ్ విమర్శించారు.

ఒక పార్టీ 2,500 కోట్లున్న వ్యక్తిని ఎన్నికల్లో నిలబెడితే మరోపార్టీ 3,500 కోట్లున్న వ్యక్తిని నిలబెడుతోందని… ఒక పార్టీ 10 హత్యలు చేసిన వాడిని నిలబడితే.. మరోపార్టీ 15 హత్యలు చేసిన వాడిని తెచ్చి నిలబెడుతోందన్నారు. ఇలాంటి రాజకీయాలను ప్రజలంతా గమనించాలని పిలుపునిచ్చారు. ప్రజలు చైతన్యవంతం కాకపోతే ప్రజాస్వామ్యానికి ఇబ్బందులుతప్పవన్నారు.

తనను ప్రశంసించిన స్వామిగౌడ్‌పైనా రేవంత్ రెడ్డి పొగడ్తల జల్లు కురిపించారు. స్వరాష్ట్రంలో సామాజిక న్యాయం కరువైందన్నారు. సామాజిక న్యాయం సాధించుకునేందుకు మరో ఉద్యయం చేయాల్సిన అవసరముందున్నారు. తెలంగాణ ఉద్యమంలో స్వామిగౌడ్ పోరాట స్పూర్తి చాలా గొప్పదని వ్యాఖ్యానించారు. సమైక్యపాలనలో స్వామిగౌడ్‌పై దాడి చేసిన వారే ఇప్పుడు ప్రభుత్వంలోని కీలక స్థానాల్లో ఉన్నారని రేవంత్ రెడ్డి విమర్శించారు.

Advertisement

Similar News