శ్రీశైలం విద్యుత్ కేంద్రం ప్రమాదంపై అమరరాజా వివరణ ఇలా...

శ్రీశైలం విద్యుత్ ప్లాంట్‌లో జరిగిన అగ్నిప్రమాదంపై అమరరాజా బ్యాటరీస్ యాజమాన్యం స్పందించింది. వివరణ ఇచ్చింది. ప్రమాదంలో అమరరాజా కంపెనీ బాధ్యత ఉందని సీపీఎం నేత గపూర్ ఆరోపించారు. బ్యాటరీలను మారుస్తున్న సమయంలోనే ఈ ప్రమాదం జరిగినట్టు వార్తలొస్తున్నాయి. విద్యుత్‌ ప్లాంట్‌లో బ్యాటరీలు సరిగా పనిచేయకపోవడంతో వాటిని మార్చాలని నిర్ణయించారు. ప్యానల్‌ బోర్డులకు విద్యుత్‌ను అందించే బ్యాటరీలు పూర్తి స్థాయిలో పనిచేయడం లేదని గుర్తించి… రెండు రోజుల క్రితమే 55 బ్యాటరీలతో కూడిన ఒక సెట్‌ను బిగించారు. మరో […]

Advertisement
Update: 2020-08-21 23:19 GMT

శ్రీశైలం విద్యుత్ ప్లాంట్‌లో జరిగిన అగ్నిప్రమాదంపై అమరరాజా బ్యాటరీస్ యాజమాన్యం స్పందించింది. వివరణ ఇచ్చింది. ప్రమాదంలో అమరరాజా కంపెనీ బాధ్యత ఉందని సీపీఎం నేత గపూర్ ఆరోపించారు. బ్యాటరీలను మారుస్తున్న సమయంలోనే ఈ ప్రమాదం జరిగినట్టు వార్తలొస్తున్నాయి.

విద్యుత్‌ ప్లాంట్‌లో బ్యాటరీలు సరిగా పనిచేయకపోవడంతో వాటిని మార్చాలని నిర్ణయించారు. ప్యానల్‌ బోర్డులకు విద్యుత్‌ను అందించే బ్యాటరీలు పూర్తి స్థాయిలో పనిచేయడం లేదని గుర్తించి… రెండు రోజుల క్రితమే 55 బ్యాటరీలతో కూడిన ఒక సెట్‌ను బిగించారు. మరో 55 బ్యాటరీలతో కూడిన సెట్‌ను బిగించే పని గురువారం రాత్రికి ముగియాల్సి ఉంది. ఈ క్రమంలోనే ప్యానెల్ బోర్డులో రాత్రి 9.30 నుంచి 10. 30 మధ్య మంటలు చెలరేగాయని పత్రికలో కథనం వచ్చింది. బ్యాటరీలను మార్చే పనిని పర్యవేక్షించేందుకు వచ్చిన ఇద్దరు ఉద్యోగులు కూడా చనిపోయారు.

అమరరాజా సంస్థ మాత్రం ఈ ఘటనతో తమకు ఎలాంటి సంబంధం లేదని చెబుతోంది. శ్రీశైలం విద్యుత్ కేంద్రంలో సమస్యలు తలెత్తినప్పుడు బ్యాకప్ కోసం అమరరాజా బ్యాటరీలను వాడుతున్నారని… అయితే వీటి నిర్వాహణ బాధ్యతలను పవర్ లైన్‌ సొల్యూషన్‌ అనే సంస్థకు అప్పగించామని అమరరాజా సంస్థ వివరణ ఇచ్చింది. బ్యాటరీల్లో ఏదైనా సమస్య తలెత్తినా, ఇబ్బందులు ఎదురైనా పూర్తి బాధ్యత పవర్ లైన్ సొల్యూషన్‌ సంస్థదేనని… తమకు ఎలాంటి సంబంధం ఉండదని అమరరాజా సంస్థ ప్రకటించింది.

Advertisement

Similar News