ఫోన్ ట్యాపింగ్‌పై వాడివేడిగా వాదనలు

ఏపీలో ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంపై హైకోర్టులో వాదనలు జరిగాయి. ఒకవేళ ట్యాపింగ్ జరిగి ఉంటే అది చాలా పెద్ద విషయమని… దర్యాప్తుకు ఆదేశిస్తే విషయాలు బయటకు వస్తాయి కదా… ప్రభుత్వానికి ఏమైనా అభ్యంతరం ఉందా అని జస్టిస్ మహేశ్వరి ప్రశ్నించారు. ప్రభుత్వం తరపున స్పందించిన అడిషనల్ అడ్వకేట్ జనరల్ సుధాకర్ రెడ్డి, న్యాయవాది సుమన్‌లు… ఈ వ్యవహారం చిన్నపిల్లల ఆటలా ఉందని వ్యాఖ్యానించారు. న్యాయమూర్తులే తమ ఫోన్లు ట్యాపింగ్‌కు గురవుతున్నట్టు చెప్పినట్టుగా కథనం రాశారని.. ఈ సమాచారానికి […]

Advertisement
Update: 2020-08-18 05:01 GMT

ఏపీలో ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంపై హైకోర్టులో వాదనలు జరిగాయి. ఒకవేళ ట్యాపింగ్ జరిగి ఉంటే అది చాలా పెద్ద విషయమని… దర్యాప్తుకు ఆదేశిస్తే విషయాలు బయటకు వస్తాయి కదా… ప్రభుత్వానికి ఏమైనా అభ్యంతరం ఉందా అని జస్టిస్ మహేశ్వరి ప్రశ్నించారు.

ప్రభుత్వం తరపున స్పందించిన అడిషనల్ అడ్వకేట్ జనరల్ సుధాకర్ రెడ్డి, న్యాయవాది సుమన్‌లు… ఈ వ్యవహారం చిన్నపిల్లల ఆటలా ఉందని వ్యాఖ్యానించారు. న్యాయమూర్తులే తమ ఫోన్లు ట్యాపింగ్‌కు గురవుతున్నట్టు చెప్పినట్టుగా కథనం రాశారని.. ఈ సమాచారానికి సోర్స్‌ ఏంటో బయటపెట్టాలని సుధాకర్ రెడ్డి కోరారు.

పత్రికలో వచ్చిన కథనాన్ని తీసుకొచ్చి పిల్ వేశారని… ఇదంతా చిల్లపిల్లల వ్యవహారంలా ఉందన్నారు. ఫోన్ ట్యాపింగ్‌ మీద హైకోర్టు న్యాయమూర్తి స్వయంగా మీడియాతో చెప్పినట్టు రాశారని గుర్తు చేశారు. ఒకవేళ ఆ మీడియా సంస్థతో జడ్జి మాట్లాడి ఉంటే ఆ జడ్జి ఎవరో, ఏం చెప్పారో కోర్టుకు స్పష్టంగా తెలియజేయాలని ప్రభుత్వ న్యాయవాదులు వాదించారు.

న్యాయమూర్తుల ఫోన్లు ట్యాపింగ్‌ అవుతున్నాయంటూ కథనం రాసిన మీడియా సంస్థను కూడా ఈ కేసులో పార్టీగా చేర్చాలని ప్రభుత్వం కోరింది.

ట్యాపింగ్‌ మీద ఆ మీడియా సంస్థకు ఎక్కడి నుంచి సమాచారం వచ్చింది అన్నది తేల్చాల్సిన అవసరం ఉందని సుధాకర్ రెడ్డి వాదించారు.

న్యాయమూర్తులపై నిఘా పెట్టారంటూ వారితో ఒక ఐపీఎస్ అధికారి చెప్పినట్టుగా పిటిషనర్ చెబుతున్నారని… సదరు ఐపీఎస్ అధికారి ఎవరో తెలియజేయాల్సిందిగా కోర్టు పిటిషనర్‌ను ఆదేశించాలని అడిషినల్ అడ్వకేట్ జనరల్ సుధాకర్ రెడ్డి కోరారు.

ట్యాపింగ్‌కు సంబంధించి ఆధారాలుంటే పిటిషనర్లు కోర్టుకు సమర్పించాలని ఆదేశిస్తూ… తదుపరి విచారణను ఈనెల 20కి వాయిదా వేసింది.

Advertisement

Similar News