కళ్లు తెరవగానే గుండెలపై... సింహం !

వినడానికి ఆశ్చర్యంగానే ఉన్నా గుజరాత్ లో ఈ భయంకరమైన ఘటన జరిగింది. విపుల్ ఖేలాయియా అనే వ్యక్తి రాత్రివేళ ఆదమరచి నిద్రపోతున్నాడు. అయితే తన గుండెలపై ఏదో బరువుగా ఉన్నట్టనిపించడంతో నిద్రనుండి మెలకువ వచ్చింది. కళ్లు తెరచి చూశాడు. ఎదురుగా తన కళ్లలోకే కళ్లుపెట్టి చూస్తున్న ఆడ సింహం. ఒక్కసారిగా నిశ్చేష్టుడై పోయి బిక్కచచ్చిపోయాడు. అయితే వెంటనే తేరుకున్నాడు. పెద్దగా కేకలు వేయటం, భయంతో వణికిపోయి అలాగే ఉండిపోవటం… లాంటివేమీ చేయకుండా శక్తినంతా ఉపయోగించి సింహాన్ని పక్కకు […]

Advertisement
Update: 2020-08-17 08:51 GMT

వినడానికి ఆశ్చర్యంగానే ఉన్నా గుజరాత్ లో ఈ భయంకరమైన ఘటన జరిగింది. విపుల్ ఖేలాయియా అనే వ్యక్తి రాత్రివేళ ఆదమరచి నిద్రపోతున్నాడు. అయితే తన గుండెలపై ఏదో బరువుగా ఉన్నట్టనిపించడంతో నిద్రనుండి మెలకువ వచ్చింది. కళ్లు తెరచి చూశాడు. ఎదురుగా తన కళ్లలోకే కళ్లుపెట్టి చూస్తున్న ఆడ సింహం.

ఒక్కసారిగా నిశ్చేష్టుడై పోయి బిక్కచచ్చిపోయాడు. అయితే వెంటనే తేరుకున్నాడు. పెద్దగా కేకలు వేయటం, భయంతో వణికిపోయి అలాగే ఉండిపోవటం… లాంటివేమీ చేయకుండా శక్తినంతా ఉపయోగించి సింహాన్ని పక్కకు తోసేశాడు.

సింహం కూడా అలాంటి ప్రతిఘటన ఊహించలేదేమో… వెంటనే అతడిని వదిలేసి అడవిలోకి వెళ్లిపోయింది. అలా సమయస్ఫూర్తి, ధైర్యసాహసాలతో విపుల్ తన ప్రాణాల్ని కాపాడుకున్నాడు. గుజరాత్ లోని అమ్రేలీ జిల్లా, సావర్ కుండ్లా తాలూకా, అభరంపర గ్రామంలో ఈ వింత ఘటన చోటుచేసుకుంది.

Advertisement

Similar News