విరసం నేత వరవరరావు విడుదల కోరుతూ సీజేఐకి 765 మంది జర్నలిస్టుల లేఖ

విరసం నేత, విప్లవ రచయిత వరవరరావు ఈ దేశ సంపద అని, తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్న ఆయనను కాపాడుకోవడం మనందరి బాధ్యత అని పలువురు తెలుగు జర్నలిస్టులు అభిప్రాయపడ్డారు. వరవరరావును బెయిల్‌పై విడుదల చేయాలని కోరుతూ సుప్రీంకోర్టు, ముంబయి హైకోర్టు ప్రధాన న్యాయమూర్తులతో పాటు మహారాష్ట్ర ముఖ్యమంత్రికి తెలుగు జర్నలిస్టులు ఒక లేఖ రాశారు. మీడియా అకాడమీ చైర్మన్ అల్లం నారాయణతో పాటు ప్రముఖ తెలుగు దిన పత్రికల ఎడిటర్లు, సీనియర్ జర్నలిస్టులు ఆ లేఖలో సమ్మతి […]

Advertisement
Update: 2020-07-30 09:09 GMT

విరసం నేత, విప్లవ రచయిత వరవరరావు ఈ దేశ సంపద అని, తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్న ఆయనను కాపాడుకోవడం మనందరి బాధ్యత అని పలువురు తెలుగు జర్నలిస్టులు అభిప్రాయపడ్డారు. వరవరరావును బెయిల్‌పై విడుదల చేయాలని కోరుతూ సుప్రీంకోర్టు, ముంబయి హైకోర్టు ప్రధాన న్యాయమూర్తులతో పాటు మహారాష్ట్ర ముఖ్యమంత్రికి తెలుగు జర్నలిస్టులు ఒక లేఖ రాశారు.

మీడియా అకాడమీ చైర్మన్ అల్లం నారాయణతో పాటు ప్రముఖ తెలుగు దిన పత్రికల ఎడిటర్లు, సీనియర్ జర్నలిస్టులు ఆ లేఖలో సమ్మతి తెలుపుతూ పేర్లను పేర్కొన్నారు. సమకాలీన, సామాజిక సమస్యలపై రచనలతో, కవిత్వంతో ప్రజలను చైతన్యం చేయడమే కాకుండా, ప్రజలకు ప్రశ్నించడం నేర్పిన గొప్ప సామాజిక వేత్త వరవర రావు అని ఆ లేఖలో పేర్కొన్నారు.

గతంలో పోలీసులు ఆయనపై మోపిన అనేక కేసుల్లో నిర్థోషిగా నిరూపితమై బైటకొచ్చారని గుర్తుచేశారు. జీవితాంతం ప్రజల కోసమే నిలిచారని, బీమా కోరేగావ్ కేసులో గత 22నెలలుగా మహారాష్ట్రలోని తలోజా జైలులో అండర్ ట్రయల్ ఖైదీగా ఉంటున్నారని, ఇటీవల ఆయన ఆరోగ్యం పూర్తిగా క్షిణించిందని పేర్కొన్నారు. కుటుంబ సభ్యులను కూడా గుర్తించలేకపోతున్నారని, కరోనా పాజిటివ్ కూడా వచ్చిందని ఆ లేఖలో ప్రస్తావించారు.

బెయిల్ పొందడం నిందితుల హక్కు అని పేర్కొని, నాగపూర్ జైలులో ఉన్న 90శాతం వికలాంగుడైన ప్రొఫెసర్ సాయిబాబా ఆరోగ్యం కూడా క్షీణిస్తోందని, ప్రస్తుతం కదలలేని పరిస్థితుల్లో ఉన్నారని, ఆయనను కూడా విడుదల చేయాలని ఆ లేఖలో పేర్కొన్నారు. తెలంగాణ, ఏపీకి చెందిన 765మంది పాత్రికేయులు ఆ లేఖలో సంతకాలు చేశారు.

Tags:    
Advertisement

Similar News