శ్రీకాకుళం జిల్లాను విభజించవద్దు...

పరిపాలన సౌలభ్యం కోసం ప్రతి పార్లమెంట్ నియోజకవర్గాన్ని ఒక జిల్లాగా మారుస్తామని ఇది వరకే ముఖ్యమంత్రి జగన్‌మోహన్ రెడ్డి ప్రకటించారు. సీనియర్ ఎమ్మెల్యే ధర్మాన ప్రసాదరావు మాత్రం శ్రీకాకుళం జిల్లా జోలికి రావొద్దని సూచించారు. జిల్లాల విభజన మంచి నిర్ణయమేనని…. కానీ అశాస్త్రీయంగా శ్రీకాకుళం జిల్లాను విభజించవద్దని కోరారు. శ్రీకాకుళంలో వైఎస్‌ విగ్రహాన్ని ఆవిష్కరించిన సందర్భంగా ధర్మాన ఈ వ్యాఖ్యలు చేశారు. జిల్లా విభజన జరిగితే ఎచ్చెర్ల, రాజాం, పాలకొండ నియోజకవర్గాలు విజయనగరం జిల్లాలో కలిసిపోతాయని… అలా […]

Advertisement
Update: 2020-07-08 20:48 GMT

పరిపాలన సౌలభ్యం కోసం ప్రతి పార్లమెంట్ నియోజకవర్గాన్ని ఒక జిల్లాగా మారుస్తామని ఇది వరకే ముఖ్యమంత్రి జగన్‌మోహన్ రెడ్డి ప్రకటించారు. సీనియర్ ఎమ్మెల్యే ధర్మాన ప్రసాదరావు మాత్రం శ్రీకాకుళం జిల్లా జోలికి రావొద్దని సూచించారు. జిల్లాల విభజన మంచి నిర్ణయమేనని…. కానీ అశాస్త్రీయంగా శ్రీకాకుళం జిల్లాను విభజించవద్దని కోరారు. శ్రీకాకుళంలో వైఎస్‌ విగ్రహాన్ని ఆవిష్కరించిన సందర్భంగా ధర్మాన ఈ వ్యాఖ్యలు చేశారు.

జిల్లా విభజన జరిగితే ఎచ్చెర్ల, రాజాం, పాలకొండ నియోజకవర్గాలు విజయనగరం జిల్లాలో కలిసిపోతాయని… అలా జరిగితే వివిధ పరిశ్రమలతో పాటు, అంబేద్కర్ విశ్వవిద్యాలయం, సీతంపేట ఐటీడీఏ వంటివి శ్రీకాకుళం జిల్లాకు లేకుండాపోతామని అభిప్రాయపడ్డారు. అప్పుడు శ్రీకాకుళం పరిస్థితి పెనం నుంచి పొయ్యిలో పడినట్టు అవుతుందన్నారు. దీనివల్ల జిల్లా అభివృద్ధి 80 ఏళ్లు వెనక్కు వెళ్తుందన్నారు.

ధర్మాన వ్యాఖ్యలను స్పీకర్ తమ్మినేని కూడా సమర్ధించారు. ఇప్పటికే ఈ అంశాన్ని తాను సీఎం దృష్టికి తీసుకెళ్లినట్టు చెప్పారు. ధర్మాన వ్యాఖ్యలపై అదే కార్యక్రమంలో పాల్గొన్న ఎంపీ విజయసాయిరెడ్డి స్పందించారు. జిల్లా పునర్‌విభజన నిర్ణయం ఎన్నికలకు ముందే జగన్‌ తీసుకున్నారని… ప్రజల మనోభావాలు దెబ్బతినకుండా, ప్రజాభిప్రాయం మేరకే జిల్లాల పునర్‌విభజన ఉంటుందని విజయసాయిరెడ్డి వ్యాఖ్యానించారు.

Tags:    
Advertisement

Similar News