అచ్చెన్నాయుడిని రమేష్ ఆస్పత్రికి తరలించాలని హైకోర్టు తీర్పు

మాజీ మంత్రి అచ్చెన్నాయుడిని ప్రైవేట్ ఆస్పత్రికి తరలించాలని హైకోర్టు ఆదేశించింది. అచ్చెన్నాయుడు ఆరోగ్యం సరిగా లేదని… కాబట్టి ఆయన్ను ప్రైవేట్ ఆస్పత్రికి తరలించేందుకు అనుమతి ఇవ్వాలంటూ పిటిషన్ వేశారు. పిటిషన్‌పై వాదనలు విన్న కోర్టు నేడు నిర్ణయాన్ని వెల్లడించింది. గుంటూరులోని రమేష్ ఆస్పత్రికి ఆయన్ను తరలించాలని కోర్టు ఆదేశించింది. దీనిపై ప్రభుత్వ న్యాయవాది అభ్యంతరం తెలిపారు. ఒకవేళ కోర్టు తీర్పు ప్రకారం అచ్చెన్నాయుడును ఆస్పత్రికి తరలించాల్సి వస్తే… ఏ ఆస్పత్రికి తరలించాలన్నది గుంటూరు జీజీహెచ్ సూపరింటెండెంట్ నిర్ణయించాల్సి […]

Advertisement
Update: 2020-07-08 00:47 GMT

మాజీ మంత్రి అచ్చెన్నాయుడిని ప్రైవేట్ ఆస్పత్రికి తరలించాలని హైకోర్టు ఆదేశించింది. అచ్చెన్నాయుడు ఆరోగ్యం సరిగా లేదని… కాబట్టి ఆయన్ను ప్రైవేట్ ఆస్పత్రికి తరలించేందుకు అనుమతి ఇవ్వాలంటూ పిటిషన్ వేశారు. పిటిషన్‌పై వాదనలు విన్న కోర్టు నేడు నిర్ణయాన్ని వెల్లడించింది.

గుంటూరులోని రమేష్ ఆస్పత్రికి ఆయన్ను తరలించాలని కోర్టు ఆదేశించింది. దీనిపై ప్రభుత్వ న్యాయవాది అభ్యంతరం తెలిపారు. ఒకవేళ కోర్టు తీర్పు ప్రకారం అచ్చెన్నాయుడును ఆస్పత్రికి తరలించాల్సి వస్తే… ఏ ఆస్పత్రికి తరలించాలన్నది గుంటూరు జీజీహెచ్ సూపరింటెండెంట్ నిర్ణయించాల్సి ఉంటుందని ప్రభుత్వ న్యాయవాది వాదించారు.

కానీ న్యాయమూర్తి ప్రభుత్వ లాయర్ వాదనను పరిగణలోకి తీసుకోలేదు. ప్రైవేట్ ఆస్పత్రి అయిన రమేష్ ఆస్పత్రికే తరలించాలని ఆదేశించింది.

Tags:    
Advertisement

Similar News