'వైఎస్ఆర్ కాపు నేస్తం' ప్రారంభం

ఏపీలో కాపుల సంక్షేమం కోసం రూపొందించిన ‘వైఎస్ఆర్ కాపు నేస్తం’ పథకాన్ని సీఎం వైఎస్ జగన్ బుధవారం ప్రారంభించారు. ఎన్నికల మేనిఫెస్టోలో హామీ ఇవ్వకపోయినా కాపుల సంక్షేమం కోసం ఈ పథకాన్ని ప్రారంభిస్తున్నామని జగన్ అన్నారు. ఇచ్చిన మాట ప్రకారం కాపుల సంక్షేమానికి కట్టుబడి ఉన్నామని.. ఈ పథకం ద్వారా అర్హులైన కాపులందరికీ లాభం చేకూరుతుందని అన్నారు. ఈ పథకం ద్వారా 45 నుంచి 60 ఏండ్ల మధ్య వయస్సు ఉన్న కాపు మహిళలకు ప్రతీ ఏడాది […]

Advertisement
Update: 2020-06-24 06:46 GMT

ఏపీలో కాపుల సంక్షేమం కోసం రూపొందించిన ‘వైఎస్ఆర్ కాపు నేస్తం’ పథకాన్ని సీఎం వైఎస్ జగన్ బుధవారం ప్రారంభించారు. ఎన్నికల మేనిఫెస్టోలో హామీ ఇవ్వకపోయినా కాపుల సంక్షేమం కోసం ఈ పథకాన్ని ప్రారంభిస్తున్నామని జగన్ అన్నారు. ఇచ్చిన మాట ప్రకారం కాపుల సంక్షేమానికి కట్టుబడి ఉన్నామని.. ఈ పథకం ద్వారా అర్హులైన కాపులందరికీ లాభం చేకూరుతుందని అన్నారు.

ఈ పథకం ద్వారా 45 నుంచి 60 ఏండ్ల మధ్య వయస్సు ఉన్న కాపు మహిళలకు ప్రతీ ఏడాది రూ. 15 వేల చొప్పున, ఐదేళ్ల పాటు రూ. 75 వేల ఆర్థిక సహాయం అందించనుంది. రాష్ట్రంలో ఉన్న 2.36 లక్షల మంది కాపు కులానికి చెందిన మహిళల ఖాతాల్లో రూ. 354 కోట్ల రూపాయలు నేరుగా వారి బ్యాంక్ అకౌంట్లలో జమ చేశారు. ఇంకా ఎవరైనా అర్హులైన మహిళలు ఉంటే దరఖాస్తు చేసుకుంటే వారిని కూడా పథకంలో లబ్దిదారులుగా చేరుస్తామని సీఎం జగన్ చెప్పారు.

పథకం ప్రారంభించిన తర్వాత సీఎం జగన్ లబ్దిదారులతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మాట్లాడారు. అర్హులైన ప్రతీ ఒక్కరు ఈ పథకాన్ని వినియోగించుకోవాలని కోరారు. గత ప్రభుత్వం కాపులను నిర్లక్ష్యం చేసిందని ఆయన అన్నారు. ఐదేండ్ల కాలంలో ఏడాదికి కనీసం రూ. 400 కోట్లను కూడా కేటాయించలేదని.. కానీ తాము అధికారంలోకి వచ్చిన తర్వాత 13 నెలల కాలంలోనే రూ. 4,700 కోట్లను కాపుల సంక్షేమం కోసం కేటాయించామని ఆయన గుర్తు చేశారు.

Tags:    
Advertisement

Similar News