చంద్రబాబు కోసం దారి మళ్లిన హైకోర్టు జడ్జి కాన్వాయ్‌

చంద్రబాబునాయుడు హైదరాబాద్ నుంచి కరకట్ట నివాసానికి వెళ్తున్న సమయంలో అసాధారణ సంఘటన ఎదురైంది. కరోనా నేపథ్యంలో లాక్‌డౌన్ ఉన్నా సరే చంద్రబాబు అవేవీ లెక్క చేకుండా రోడ్డుపై హల్‌చల్ చేశారు. కరకట్ట వైపు వెళ్లే దారి మొత్తం టీడీపీ కార్యకర్తలతో స్తంభించిపోయింది. దాదాపు రెండు వందల మంది కార్యకర్తలు రోడ్డుపై హడావుడి చేశారు. చంద్రబాబు కూడా కారు దిగి వారికి విక్టరీ సింబల్ చూపుతూ పలకరించారు. ఈ సమయంలోనే అటుగా హైకోర్టు న్యాయమూర్తి కాన్వాయ్ వచ్చింది. హైకోర్టు […]

Advertisement
Update: 2020-05-25 19:59 GMT

చంద్రబాబునాయుడు హైదరాబాద్ నుంచి కరకట్ట నివాసానికి వెళ్తున్న సమయంలో అసాధారణ సంఘటన ఎదురైంది. కరోనా నేపథ్యంలో లాక్‌డౌన్ ఉన్నా సరే చంద్రబాబు అవేవీ లెక్క చేకుండా రోడ్డుపై హల్‌చల్ చేశారు. కరకట్ట వైపు వెళ్లే దారి మొత్తం టీడీపీ కార్యకర్తలతో స్తంభించిపోయింది. దాదాపు రెండు వందల మంది కార్యకర్తలు రోడ్డుపై హడావుడి చేశారు. చంద్రబాబు కూడా కారు దిగి వారికి విక్టరీ సింబల్ చూపుతూ పలకరించారు. ఈ సమయంలోనే అటుగా హైకోర్టు న్యాయమూర్తి కాన్వాయ్ వచ్చింది.

హైకోర్టు న్యాయమూర్తి వస్తున్నారు రూట్ క్లియర్ చేయాలని పోలీసులు కోరినా టీడీపీ నేతలు, కార్యకర్తలు లెక్క చేయకుండా వారి ఆనందంలో వారు ఉండిపోయారు. కొద్దిసేపు రోడ్డుపైనే న్యాయమూర్తి కాన్వాయ్ ఆగిపోయింది. టీడీపీ వారు దారి ఇవ్వకపోవడంతో చివరకు పోలీసులు న్యాయమూర్తి కారును పెనుమాక మీదుగా ఉండవల్లి మార్గంలో మళ్లించారు.

అటు చంద్రబాబునాయుడు పర్యటనకు ఇచ్చిన అనుమతులపై వైసీపీ ఎమ్మెల్యే మేరుగ నాగార్జున హైకోర్టు ప్రధాన న్యాయమూర్తికి లేఖ రాశారు. చంద్రబాబు తనకిచ్చిన అనుమతిని దుర్వినియోగం చేశారని… లాక్‌డౌన్ నిబంధనలను ఉల్లంఘించి తన పర్యటనను ఒక రాజకీయ షోగా మార్చేశారని లేఖలో వివరించారు. పర్యటన అనుమతులు రద్దు చేయడంతో పాటు చంద్రబాబుపై కేసులు నమోదు చేసేలా ఆదేశాలు ఇవ్వాలని ప్రధాన న్యాయమూర్తిని లేఖలో మేరుగ నాగార్జున కోరారు.

Tags:    
Advertisement

Similar News