ఎట్టకేలకు ఛాన్స్ కొట్టేసింది

బిగ్ బాస్ హౌజ్ నుంచి బయటకొచ్చిన వాళ్లంతా బిజీ అయిపోయారు. దాదాపు కీలక సభ్యులందరికీ సినీ అవకాశాలొచ్చాయి. ఒక్క శ్రీముఖికి తప్ప. హౌజ్ లో ఆఖరి రోజు వరకు ఉన్న శ్రీముఖికి అవకాశాలు రాకపోవడం ఏంటంటూ చాలా పెద్ద డిస్కషన్ నడిచింది ఆమధ్య. ఎట్టకేలకు ఈమెకు కూడా ఓ సినిమా వచ్చింది. ఆమె పుట్టినరోజు సందర్భంగా ఇట్స్ టైమ్ టు పార్టీ అనే సినిమాను ఎనౌన్స్ చేశారు. పనిలోపనిగా ఫస్ట్ లుక్ కూడా రిలీజ్ చేశారు. బిగ్ […]

Advertisement
Update: 2020-05-11 20:30 GMT

బిగ్ బాస్ హౌజ్ నుంచి బయటకొచ్చిన వాళ్లంతా బిజీ అయిపోయారు. దాదాపు కీలక సభ్యులందరికీ సినీ అవకాశాలొచ్చాయి. ఒక్క శ్రీముఖికి తప్ప. హౌజ్ లో ఆఖరి రోజు వరకు ఉన్న శ్రీముఖికి అవకాశాలు రాకపోవడం ఏంటంటూ చాలా పెద్ద డిస్కషన్ నడిచింది ఆమధ్య. ఎట్టకేలకు ఈమెకు కూడా ఓ సినిమా వచ్చింది. ఆమె పుట్టినరోజు సందర్భంగా ఇట్స్ టైమ్ టు పార్టీ అనే సినిమాను ఎనౌన్స్ చేశారు. పనిలోపనిగా ఫస్ట్ లుక్ కూడా రిలీజ్ చేశారు.

బిగ్ బాస్ హౌజ్ నుంచి ఇలా వచ్చిన వెంటనే అలా క్లిక్ అయ్యాడు రాహుల్. అతడికి సింగింగ్ ఛాన్సులతో పాటు నటించే అవకాశాలు కూడా వచ్చాయి. ఇక హౌజ్ నుంచి కాస్త ముందుగానే తప్పుకున్న పునర్నవికి కూడా 2 సినిమా ఆఫర్లు వచ్చాయి. హౌజ్ లో ఆఖరి నిమిషం వరకు ఉండి, రన్నరప్ గా నిలిచిన శ్రీముఖికి మాత్రం సినిమా ఛాన్స్ రావడానికి ఇంత టైమ్ పట్టింది.

అయితే సినిమా అవకాశమైతే వచ్చింది కానీ ఆమెది లీడ్ రోల్ కాదు. అలాగని హీరోయిన్ పాత్ర కూడా కాదు. ఇట్స్ టైమ్ టు పార్టీ అనేది ఓ సైబర్ క్రైమ్ థ్రిల్లర్. నాలుగు పాత్రల చుట్టూ కథ తిరుగుతుంది. ప్రస్తుత సమాజంలో యువతరం జీవితాలకు అద్దం పట్టేలా ఉంటుంది. సినిమాలో శ్రీముఖి ఫుల్ లెంగ్త్ రోల్ చేయడం లేదు. కానీ, ఆమెది చాలా ఇంపార్టెంట్ క్యారెక్టర్.

Tags:    
Advertisement

Similar News