ఆర్ఆర్ఆర్ ఫలితం పైనే అల్లు అరవింద్ డ్రీమ్ ప్రాజెక్ట్

బాహుబలి2 విడుదలైన కొద్ది నెలలకే ‘రామాయణం’ తీయబోతున్నారనే ప్రకటన వెలువడింది. సుమారు 1500 కోట్ల భారీ బడ్జెట్ తో ఈ ప్రాజెక్టును రూపొందించాలని… దేశంలోనే బడా నిర్మాతలు అల్లు అరవింద్, మధుమంతేనా, నమిత్ మల్హోత్రా కలిసి దీన్ని నిర్మిస్తారని ప్రకటన వెలువడింది. అల్లు అరవింద్ అయితే ఇదే తన డ్రీమ్ ప్రాజెక్ట్ అని ప్రకటించాడు. ఇక ‘రామాయణం’లో చేయబోతున్నారని చాలా మంది నటుల పేర్లు తెరపైకి వచ్చాయి. అయితే ఇంత భారీ బడ్జెట్ కు తోడు కథ, […]

Advertisement
Update: 2020-04-18 23:43 GMT

బాహుబలి2 విడుదలైన కొద్ది నెలలకే ‘రామాయణం’ తీయబోతున్నారనే ప్రకటన వెలువడింది. సుమారు 1500 కోట్ల భారీ బడ్జెట్ తో ఈ ప్రాజెక్టును రూపొందించాలని… దేశంలోనే బడా నిర్మాతలు అల్లు అరవింద్, మధుమంతేనా, నమిత్ మల్హోత్రా కలిసి దీన్ని నిర్మిస్తారని ప్రకటన వెలువడింది. అల్లు అరవింద్ అయితే ఇదే తన డ్రీమ్ ప్రాజెక్ట్ అని ప్రకటించాడు.

ఇక ‘రామాయణం’లో చేయబోతున్నారని చాలా మంది నటుల పేర్లు తెరపైకి వచ్చాయి. అయితే ఇంత భారీ బడ్జెట్ కు తోడు కథ, కథనంతో పాటు ఫేమస్ దర్శకుడు అవసరం. అందుకే ఇది వాస్తవ రూపంలోకి రాలేదు. అందుకే ఈ ప్రాజెక్టును నిలిపివేశారనే టాక్ కూడా వినిపించింది.

తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం.. టాలీవుడ్ బడా నిర్మాత అల్లు అరవింద్ ఈ ప్రాజెక్టును మళ్లీ తెరపైకి తీసుకొస్తున్నాడట.. ఈ మేరకు ప్రణాళికలు వేస్తున్నాడట.. ఈ సాహసం చేయడానికి కారణం రాజమౌళి తీస్తున్న ‘ఆర్ఆర్ఆర్’. ఈ భారీ బడ్జెట్ చిత్రం విడుదల వరకు వేచి చూసి అది హిట్ అయితే ‘రామాయణం’పై ముందుకెళుదామని అల్లు అరవింద్ భావిస్తున్నాడట.. ఆర్ఆర్ఆర్ ఫలితం పెద్ద బడ్జెట్, ప్యాన్ ఇండియా చిత్రాల భవిష్యత్ ను నిర్ణయిస్తుంది. మరి ఏం జరుగుతుందో చూడాలి.

Tags:    
Advertisement

Similar News