ఏపీ ఎన్నికల కమిషనర్ రమేష్ కుమార్ తొలగింపు

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్‌కుమార్‌ను తొలగిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. అంతకు మునుపు ఎన్నికల కమిషనర్ నియామకం, పదవీ కాలానికి సంబంధించిన నిబంధనలు సవరిస్తూ ప్రభుత్వం పంపిన ఆర్డినెన్స్‌కు గవర్నర్ విశ్వభూషణ్ హరి చందన్ ఆమోద ముద్ర వేశారు. ఏపీ ప్రభుత్వం కొత్తగా తీసుకొచ్చిన ఆర్డినెన్స్ ప్రకారం రాష్ట్ర ఎన్నికల కమిషనర్ పదవీ కాలం 3 ఏళ్లకు కుదించబడింది. తాజా నిబంధనల ప్రకారం రమేష్ కుమార్ పదవీ కాలం ముగిసిపోయింది. దీంతో ఆయనను […]

Advertisement
Update: 2020-04-10 07:22 GMT

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్‌కుమార్‌ను తొలగిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. అంతకు మునుపు ఎన్నికల కమిషనర్ నియామకం, పదవీ కాలానికి సంబంధించిన నిబంధనలు సవరిస్తూ ప్రభుత్వం పంపిన ఆర్డినెన్స్‌కు గవర్నర్ విశ్వభూషణ్ హరి చందన్ ఆమోద ముద్ర వేశారు.

ఏపీ ప్రభుత్వం కొత్తగా తీసుకొచ్చిన ఆర్డినెన్స్ ప్రకారం రాష్ట్ర ఎన్నికల కమిషనర్ పదవీ కాలం 3 ఏళ్లకు కుదించబడింది. తాజా నిబంధనల ప్రకారం రమేష్ కుమార్ పదవీ కాలం ముగిసిపోయింది. దీంతో ఆయనను తొలగిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. గుంటూరు జిల్లాకు చెందిన ఏపీ క్యాడర్ ఐఏఎస్ రమేష్ కుమార్‌ను.. రిటైర్ అయ్యాక ఏపీ ఎన్నికల కమిషనర్‌గా అప్పటి సీఎం చంద్రబాబు నియమించారు. అంతకు మునుపు ఆయన టీటీడీ ఈవోగా కూడా పని చేశారు.

కాగా, ఏపీలో వైఎస్ జగన్ సీఎంగా బాధ్యతలు చేపట్టాక ఎన్నికల కమిషనర్ రమేష్ బాబు పలు విషయాల్లో విభేదిస్తూ వచ్చారు. ప్రభుత్వాన్ని సంప్రదించకుండా ఏక పక్షంగా స్థానిక సంస్థల ఎన్నికలను రద్దు చేయడమే కాకుండా.. భారీ స్థాయిలో ఐఏఎస్, ఐపీఎస్‌లతో పాటు పలువురు ప్రభుత్వ అధికారులను బదిలీ చేశారు. ప్రతిపక్ష చంద్రబాబు నాయుడు మాటలకు విలువనిస్తున్నారనే ఆరోపణలు కూడా మీడియాలో హల్ చల్ చేశాయి. పేదల ఇళ్ల పథకానికి కూడా రమేష్ కుమార్ అడ్డు తగిలారు. దీంతో ఆయనపై ఏపీ ప్రభుత్వం గుర్రుగా ఉంది. ఆ విభేదాలే చివరకు ఆయన పదవి పోవడానికి కారణమైందని రాజకీయ వర్గాల్లో చర్చ మొదలైంది.

Tags:    
Advertisement

Similar News