40 మందితో శ్రీరామనవమి వేడుకలు

కరోనా కట్టడి కోసం దేశమంతా లాక్‌డౌన్ ప్రకటించిన విషయం తెలిసిందే. సభలు, సమావేశాలు, మత సమ్మేళనాల వంటివి నిషేధించారు. ఇప్పటికే ఆలయాలు, మసీదులు, చర్చీలు అన్నీ మూతబడ్డాయి. ఎక్కడా గుంపులుగా చేరవద్దని ప్రభుత్వాలు ఆదేశాలు జారీ చేశాయి. లాక్‌డౌన్ కంటే ముందే జరిగిన మర్కజ్ ప్రార్థనల వల్ల వందలాది మంది కరోనా బారిన పడినట్లు అనుమానాలు తలెత్తుతున్నాయి. దీంతో మతపరమైన ఉత్సవాలపై కఠిన నిబంధనలు అమలులోనికి తెచ్చారు. శ్రీరామనవమి అంటేనే గుర్తుకు వచ్చేది భద్రాచలం.. ప్రతీ ఏడాది […]

Advertisement
Update: 2020-03-31 22:35 GMT

కరోనా కట్టడి కోసం దేశమంతా లాక్‌డౌన్ ప్రకటించిన విషయం తెలిసిందే. సభలు, సమావేశాలు, మత సమ్మేళనాల వంటివి నిషేధించారు. ఇప్పటికే ఆలయాలు, మసీదులు, చర్చీలు అన్నీ మూతబడ్డాయి. ఎక్కడా గుంపులుగా చేరవద్దని ప్రభుత్వాలు ఆదేశాలు జారీ చేశాయి.

లాక్‌డౌన్ కంటే ముందే జరిగిన మర్కజ్ ప్రార్థనల వల్ల వందలాది మంది కరోనా బారిన పడినట్లు అనుమానాలు తలెత్తుతున్నాయి. దీంతో మతపరమైన ఉత్సవాలపై కఠిన నిబంధనలు అమలులోనికి తెచ్చారు.

శ్రీరామనవమి అంటేనే గుర్తుకు వచ్చేది భద్రాచలం.. ప్రతీ ఏడాది రాముని కళ్యాణానికి దేశంలోని వివిధ ప్రాంతాల నుంచి లక్ష మందికి పైగా భక్తులు వస్తారు. సీతారాముల కళ్యాణాన్ని కనులారా వీక్షించి.. తలంబ్రాలను తీసుకొని పానకం సేవించి రాముని ఆశీస్సులతో ఇండ్లకు తిరిగి వెళ్తుంటారు. కాగా కరోనా భయంతో ఇప్పటికే రాముల వారి ఆలయం మూత పడింది. కేవలం కైంకర్య సేవలు మాత్రమే జరుగుతున్నాయి. భక్తులను ఆలయంలోనికి రానివ్వడంలేదు.

ఇక ఇప్పుడు రాముల వారి కళ్యాణం కూడా కొద్ది మంది మధ్య మాత్రమే జరగనుంది. భక్తులకు అనుమతి లేకపోవడంతో తొలి సారి 40 మంది మధ్య ఈ ఉత్సవం నిర్వహించనున్నారు. ఆనవాయితీ ప్రకారం తెలంగాణ ప్రభుత్వం అందించే పట్టు వస్త్రాలు, ముత్యాల తలంబ్రాలను మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి తీసుకొని రానున్నారు. భక్తులు ఈ కళ్యాణాన్ని టీవీల్లో ప్రత్యక్ష ప్రసారాల్లో చూడవచ్చని ఆలయ ఈవో తెలిపారు.

మరోవైపు తిరుమలలో శ్రీరామనవమి సందర్భంగా జరిగే కార్యక్రమాలు కూడా రద్దయ్యాయి. ఇప్పటికే అక్కడ భక్తులను అనుమతించడం లేదు. శ్రీవారి వసంతోత్సవం కూడా రద్దయ్యింది. కేవలం స్వామి వారికి పూజారులు కైంకర్యాలు మాత్రమే నిర్వహిస్తున్నారు.

Tags:    
Advertisement

Similar News