మధ్యప్రదేశ్ సీఎం రాజీనామా

మధ్యప్రదేశ్ సీఎం కమల్‌నాథ్ తన పదవికి రాజీనామా చేశారు. ఇవాళ అసెంబ్లీలో బలపరీక్ష ఉన్న నేపథ్యంలో ఆయన అంతకు ముందే మీడియా సమావేశం ఏర్పాటు చేసి తన రాజీనామా విషయాన్ని వెల్లడించారు. 15 నెలల పాటు రాష్ట్ర అభివృద్ధి కోసం ఎంతగానో కష్టపడి పని చేశామని అన్నారు. ప్రజలు మాకు ఐదేండ్లు పాలించమని ప్రజలు అవకాశం ఇచ్చారు. మెజార్టీ స్థానాలు గెలుచుకొని అధికారంలోనికి వచ్చిన పార్టీని పడగొట్టటానికి బీజేపీ అన్ని ప్రయాత్నాలు చేసిందని ఆయన విమర్శించారు. మా […]

Advertisement
Update: 2020-03-20 03:24 GMT

మధ్యప్రదేశ్ సీఎం కమల్‌నాథ్ తన పదవికి రాజీనామా చేశారు. ఇవాళ అసెంబ్లీలో బలపరీక్ష ఉన్న నేపథ్యంలో ఆయన అంతకు ముందే మీడియా సమావేశం ఏర్పాటు చేసి తన రాజీనామా విషయాన్ని వెల్లడించారు. 15 నెలల పాటు రాష్ట్ర అభివృద్ధి కోసం ఎంతగానో కష్టపడి పని చేశామని అన్నారు.

ప్రజలు మాకు ఐదేండ్లు పాలించమని ప్రజలు అవకాశం ఇచ్చారు. మెజార్టీ స్థానాలు గెలుచుకొని అధికారంలోనికి వచ్చిన పార్టీని పడగొట్టటానికి బీజేపీ అన్ని ప్రయాత్నాలు చేసిందని ఆయన విమర్శించారు. మా ప్రభుత్వం ఏర్పడిన నాటి నుంచే బీజేపీ అనేక కుట్రలు పన్నిందని ఆయన ఆరోపించారు.

మధ్యప్రదేశ్ అసెంబ్లీలో శుక్రవారం బలపరీక్ష నిర్వహించాలని సుప్రీంకోర్టు ఆదేశాలు ఇవ్వడంతో అక్కడ రాజకీయాలు ఉత్కంఠంగా మారాయి. ఇప్పటికే మాజీ కాంగ్రెస్ నేత జ్యోతిరాధిత్య సింధియా వర్గానికి చెందిన 22 మంది ఎమ్మెల్యేలు తమ పదవులకు రాజీనామా చేశారు. దీంతో విశ్వాస పరీక్ష నెగ్గడం కష్టమని భావించిన కమలనాథ్ తన ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేశారు.

Tags:    
Advertisement

Similar News