ఎన్నికల వేళ... ఏమిటిది పవన్ కల్యాణ్ గారూ..!

పవన్ కల్యాణ్ రాజకీయ అయోమయ విధానాల గురించి మనం ప్రత్యేకంగా మాట్లాడుకోవాల్సిన.. వెతుక్కోవాల్సిన పని లేదు. ఆ అవకాశాన్ని ఆయనే పదే పదే ఇచ్చేస్తుంటారు. రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికల వేడి రగులుతున్న వేళ.. రాజమహేంద్రవరం వేదికగా ఆయన నిర్వహించిన ”మన నది మన నుడి” కార్యక్రమం ఈ కోవలోకే వస్తుంది. వైసీపీ, టీడీపీ నేతల విమర్శలు, ప్రతి విమర్శలతో.. రాష్ట్రమంతా రాజకీయ వేడి అలుముకున్న వేళ.. ఈ కార్యక్రమంతో.. పవన్ జనం ముందుకు వచ్చారు. ప్రజల […]

Advertisement
Update: 2020-03-15 08:10 GMT

పవన్ కల్యాణ్ రాజకీయ అయోమయ విధానాల గురించి మనం ప్రత్యేకంగా మాట్లాడుకోవాల్సిన.. వెతుక్కోవాల్సిన పని లేదు. ఆ అవకాశాన్ని ఆయనే పదే పదే ఇచ్చేస్తుంటారు. రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికల వేడి రగులుతున్న వేళ.. రాజమహేంద్రవరం వేదికగా ఆయన నిర్వహించిన ”మన నది మన నుడి” కార్యక్రమం ఈ కోవలోకే వస్తుంది. వైసీపీ, టీడీపీ నేతల విమర్శలు, ప్రతి విమర్శలతో.. రాష్ట్రమంతా రాజకీయ వేడి అలుముకున్న వేళ.. ఈ కార్యక్రమంతో.. పవన్ జనం ముందుకు వచ్చారు.

ప్రజల దృష్టిని గమనిస్తే.. వారు ఈ విషయంలో ఎక్కువగా స్పందించినట్టు కూడా కనిపించలేదు. జన సైనికులు కూడా.. ఈ కార్యక్రమ నిర్వహణలో అయోమయానికి గురయ్యారట. బీజేపీతో పొత్తు కారణంగా.. అసలే రాష్ట్ర వ్యాప్తంగా ఎన్నికల్లో పోటీ చేయలేకపోతున్నామని కేడర్ అసంతృప్తితో ఉంటే.. వారిని చల్లార్చాల్సింది పోయి.. ఈ అసందర్భ కార్యక్రమాలు ఏంటన్న చర్చే అంతటా జరుగుతోంది.

సంస్కృతిని.. సంప్రదాయాలను కాపాడుకునే చర్యలను ఎవరూ తప్పుబట్టరు. కానీ.. వాటిని ఆచరించే విధానంలోనే జనామోదం ఉండాలి. ఇలా ఎన్నికల వేళ అటూ ఇటూ కాని రీతిలో సదస్సులు నిర్వహించడం.. తర్వాత కవి సమ్మేళనాలకు ఏర్పాట్లు చేయడం చూస్తుంటే.. పవన్ కల్యాణ్ గారూ.. ఏంటిదీ.. అని చాలా మంది ప్రశ్నిస్తున్నారు. ఏ వ్యూహంలో భాగంగా ఇలాంటి కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారన్నదీ అర్థం కాక.. జుట్టు పీక్కుంటున్నారు.

ఈ విషయంలో పవన్ కల్యాణ్ అయినా కాస్త త్వరగా క్లారిటీ ఇస్తే.. బాగుంటుందేమో !

Tags:    
Advertisement

Similar News