స్థానిక సమరంలో... భారతీయ "జన"తా "సేన"!

స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీ చేసేందుకు ఆంధ్రప్రదేశ్ రాజకీయ మిత్రులు జనసేన, బీజేపీ.. అంగీకారానికి వచ్చాయి… కలిసి పోటీ చేయాలని నిర్ణయించాయి. సమయం తక్కువగా ఉన్న కారణంగా.. పొత్తులు కూడా త్వరలో ఖరారు చేయాలన్న నిర్ణయానికి వచ్చాయి. ఈ విషయాన్ని ఇరు పార్టీల సమావేశం అనంతరం.. అగ్ర నేతలు పురంధేశ్వరి, నాదెండ్ల మనోహర్ వెల్లడించారు. మండల, జిల్లా స్థాయిలతో పాటు శాసనసభ నియోజకవర్గ స్థాయిల్లో సమన్వయ కమిటీలు వేయాలని ఇరు పార్టీల నేతలు నిర్ణయించారు. ఈ నెల […]

Advertisement
Update: 2020-03-09 07:45 GMT

స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీ చేసేందుకు ఆంధ్రప్రదేశ్ రాజకీయ మిత్రులు జనసేన, బీజేపీ.. అంగీకారానికి వచ్చాయి… కలిసి పోటీ చేయాలని నిర్ణయించాయి. సమయం తక్కువగా ఉన్న కారణంగా.. పొత్తులు కూడా త్వరలో ఖరారు చేయాలన్న నిర్ణయానికి వచ్చాయి. ఈ విషయాన్ని ఇరు పార్టీల సమావేశం అనంతరం.. అగ్ర నేతలు పురంధేశ్వరి, నాదెండ్ల మనోహర్ వెల్లడించారు.

మండల, జిల్లా స్థాయిలతో పాటు శాసనసభ నియోజకవర్గ స్థాయిల్లో సమన్వయ కమిటీలు వేయాలని ఇరు పార్టీల నేతలు నిర్ణయించారు. ఈ నెల 12న ఉమ్మడి ప్రణాళిక విడుదల చేస్తామని.. ప్రజలకు ఇచ్చే హామీలు వెల్లడిస్తామని తెలిపారు. అవినీతికి దూరంగా ఎన్నికల్లో పోటీ చేస్తామన్న జనసేన నేత నాదెండ్ల.. బీజేపీతో కలిసి పోటీకి అంగీకారానికి వచ్చినట్టు తెలిపారు.

జనసేన అధినేత పవన్ కల్యాణ్ సినిమాలతో మళ్లీ బిజీ అయిన నేపథ్యంలో.. ఆ పార్టీ తరఫున నాదెండ్ల మనోహర్ రాజకీయ వ్యవహారాల బాధ్యతలు తీసుకున్నారు. బీజేపీ వైపు కన్నా లక్ష్మీనారాయణ తర్వాత.. జీవీఎల్, పురంధేశ్వరి స్థానిక సమరాన్ని ముందుకు తీసుకుపోయే పనులు చూస్తున్నారు. ఈ నేతలంతా కలిసి సమావేశమైన తర్వాత.. కలిసి పని చేయాలని నిర్ణయించారు.

రాష్ట్రంలో అధికార వైసీపీ, ప్రతిపక్ష టీడీపీ.. హోరాహోరీగా తలపడేందుకు సిద్ధపడుతున్న తరుణంలో.. మధ్యలో మేమూ ఉన్నామంటున్న ఈ కూటమి.. ఎలాంటి ప్రభావాన్ని చూపుద్దో చూడాలి.

Tags:    
Advertisement

Similar News