వరల్డ్ ఫేమస్ లవర్ దుకాణం సర్దేశాడు

సినిమాకు మొదటి రోజే డిజాస్టర్ టాక్ రావడం, కొత్త సినిమాల రాకతో వరల్డ్ ఫేమస్ లవర్ తన ఫైనల్ రన్ ముగించింది. విజయ్ దేవరకొండ కెరీర్ లో రెండో బిగ్గెస్ట్ డిజాస్టర్ గా నిలిచింది ఈ సినిమా. ఈ సినిమాను అటుఇటుగా 24 కోట్ల రూపాయలకు కొన్నారు బయ్యర్లు. కట్ చేస్తే 9 కోట్ల రూపాయలు కూడా రాలేదు. విచిత్రమైన పరిస్థితి ఏంటంటే.. ఆ 9 కోట్లలో 3 కోట్ల రూపాయలు ఒక్క నైజాం నుంచే వచ్చాయి. […]

Advertisement
Update: 2020-02-28 00:35 GMT

సినిమాకు మొదటి రోజే డిజాస్టర్ టాక్ రావడం, కొత్త సినిమాల రాకతో వరల్డ్ ఫేమస్ లవర్ తన ఫైనల్ రన్ ముగించింది. విజయ్ దేవరకొండ కెరీర్ లో రెండో బిగ్గెస్ట్ డిజాస్టర్ గా నిలిచింది ఈ సినిమా. ఈ సినిమాను అటుఇటుగా 24 కోట్ల రూపాయలకు కొన్నారు బయ్యర్లు. కట్ చేస్తే 9 కోట్ల రూపాయలు కూడా రాలేదు.

విచిత్రమైన పరిస్థితి ఏంటంటే.. ఆ 9 కోట్లలో 3 కోట్ల రూపాయలు ఒక్క నైజాం నుంచే వచ్చాయి. ఇక మిగతా ప్రాంతాల్లో ఈ సినిమా ఏ రేంజ్ లో ఆడిందో అర్థం చేసుకోవచ్చు. అటు ఓవర్సీస్ లో ఈ సినిమా కోటి రూపాయల షేర్ కూడా టచ్ చేయలేక చతికిలపడింది.

ఈ సినిమాతో విజయ్ దేవరకొండ మార్కెట్ పూర్తిగా పడిపోవడమే కాకుండా.. అతడి సినిమాల ఎంపికపై కూడా ఎన్నో విమర్శలు చెలరేగాయి. ఇది ఎంత పెద్ద దెబ్బ కొట్టిందంటే.. ప్రస్తుతం దర్శకుడు-విజయ్ దేవరకొండకు.. నిర్మాత-హీరోకు మధ్య ఓ రేంజ్ లో గొడవలు జరుగుతున్నట్టు వార్తలు వస్తున్నాయి. వరల్డ్ ఫేమస్ లవర్ క్లోజింగ్ కలెక్షన్లు ఇలా ఉన్నాయి

నైజాం – రూ. 3.5 కోట్లు
సీడెడ్ – రూ. 0.85 కోట్లు
ఉత్తరాంధ్ర -రూ. 0.70 కోట్లు
ఈస్ట్ – రూ. 0.63 కోట్లు
వెస్ట్ – రూ. 0.30 కోట్లు
గుంటూరు -రూ. 0.48 కోట్లు
నెల్లూరు – రూ. 0.26 కోట్లు
కృష్ణా – రూ. 0.50 కోట్లు

Tags:    
Advertisement

Similar News