దేవరకొండ రంగంలోకి దిగాడు

ప్రచారం విషయంలో హీరోలంతా ఒక వైపు. విజయ్ దేవరకొండ ఒక్కడు మరో వైపు. ఇతడి ప్రచార శైలి చాలా విభిన్నంగా, వినూత్నంగా ఉంటుంది. కేవలం ప్రమోషన్ తో అందర్నీ తనవైపు తిప్పుకోగల టాలెంట్ ఈ హీరో సొంతం. ఇప్పుడు మరోసారి ప్రమోషన్ కోసం రెడీ అవుతున్నాడు విజయ్ దేవరకొండ. అతడి కొత్త సినిమా వరల్డ్ ఫేమస్ లవర్ విడుదలకు సిద్ధమైంది. ఆ మూవీ ప్రచారాన్ని స్టార్ట్ చేయబోతున్నాడు. నిన్నటివరకు ముంబయిలో ఉన్నాడు దేవరకొండ. పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో […]

Advertisement
Update: 2020-02-03 00:34 GMT

ప్రచారం విషయంలో హీరోలంతా ఒక వైపు. విజయ్ దేవరకొండ ఒక్కడు మరో వైపు. ఇతడి ప్రచార శైలి చాలా విభిన్నంగా, వినూత్నంగా ఉంటుంది. కేవలం ప్రమోషన్ తో అందర్నీ తనవైపు తిప్పుకోగల టాలెంట్ ఈ హీరో సొంతం. ఇప్పుడు మరోసారి ప్రమోషన్ కోసం రెడీ అవుతున్నాడు విజయ్ దేవరకొండ. అతడి కొత్త సినిమా వరల్డ్ ఫేమస్ లవర్ విడుదలకు సిద్ధమైంది. ఆ మూవీ ప్రచారాన్ని స్టార్ట్ చేయబోతున్నాడు.

నిన్నటివరకు ముంబయిలో ఉన్నాడు దేవరకొండ. పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో ఫైటర్ అనే సినిమా చేస్తున్నాడు. వరల్డ్ ఫేమస్ లవర్ ప్రమోషన్ కోసం ఆ షెడ్యూల్ కు కాస్త విరామం ఇచ్చాడు. వాలంటైన్స్ డే కానుకగా ఫిబ్రవరి 14న ఈ సినిమా థియేటర్లలోకి రాబోతోంది. ఆ మూవీ థియేటర్లలోకి వచ్చిన వెంటనే తిరిగి ముంబయి వెళ్లి ఫైటర్ షూట్ లో జాయిన్ అవుతాడు.

నిజానికి వరల్డ్ ఫేమస్ లవర్ పై పెద్దగా బజ్ లేదు. రీసెంట్ గా విజయ్ నటించిన సినిమాలు ఫ్లాప్ అవ్వడంతో పాటు.. తాజా సినిమా ప్రచారానికి అతడు దూరంగా ఉండడంతో ఎవ్వరూ దీన్ని పట్టించుకోలేదు. ఇప్పటివరకు నిర్మాత మాత్రమే ఇంటర్వ్యూలు ఇచ్చాడు. కనీసం హీరోయిన్లు, దర్శకుడు కూడా రంగంలోకి దిగలేదు. ఇప్పుడు దేవరకొండ రాకతో ఈ సినిమా లైమ్ లైట్లోకి వచ్చే అవకాశం ఉంది.

Tags:    
Advertisement

Similar News