తెలంగాణ రాజకీయాల్లోకి పవన్ కళ్యాణ్ ?

జనసేన అధినేత పవన్ కళ్యాణ్ త్వరలో తెలంగాణపై దృష్టిపెట్టనున్నారా..? సీఎం కేసీఆర్‌కు వ్యతిరేకంగా కూటమి కట్టబోతున్నారా.? అంటే జనసేన వర్గాలు అవుననే అంటున్నాయి. సినీ నటుడుగా కొనసాగుతూ ఉండగానే పవన్ కళ్యాణ్ ప్రత్యక్ష రాజకీయాల్లోకి దిగారు. సొంతంగా జనసేన పార్టీని స్థాపించినా 2014 ఎన్నికల్లో పోటీ చేయలేదు. ఆ తర్వాత ప్రతిపక్షంలో ఉన్న వైసీపీపై యుద్దం ప్రకటించారు. వైసీపీ 2019లో అధికారంలోకి వచ్చినా ఎప్పుడు అదే పార్టీ లక్ష్యంగా విమర్శలు గుప్పిస్తూ వస్తున్నారు. తాను పోటీ చేసిన […]

Advertisement
Update: 2019-12-24 09:27 GMT

జనసేన అధినేత పవన్ కళ్యాణ్ త్వరలో తెలంగాణపై దృష్టిపెట్టనున్నారా..? సీఎం కేసీఆర్‌కు వ్యతిరేకంగా కూటమి కట్టబోతున్నారా.? అంటే జనసేన వర్గాలు అవుననే అంటున్నాయి. సినీ నటుడుగా కొనసాగుతూ ఉండగానే పవన్ కళ్యాణ్ ప్రత్యక్ష రాజకీయాల్లోకి దిగారు. సొంతంగా జనసేన పార్టీని స్థాపించినా 2014 ఎన్నికల్లో పోటీ చేయలేదు.

ఆ తర్వాత ప్రతిపక్షంలో ఉన్న వైసీపీపై యుద్దం ప్రకటించారు. వైసీపీ 2019లో అధికారంలోకి వచ్చినా ఎప్పుడు అదే పార్టీ లక్ష్యంగా విమర్శలు గుప్పిస్తూ వస్తున్నారు. తాను పోటీ చేసిన రెండు స్థానాల్లో ఓడిపోయినా.. అది కార్యకర్తల వల్లే అంటూ నెపం వారిపైకి నెట్టేశారు. ఇలా ఏపీ రాజకీయాల్లో పూర్తిగా విఫలమైన పవన్ కళ్యాణ్.. ఇప్పుడు తెలంగాణలో అడుగుపెడతానని అంటున్నారు.

గతంలో కూడా ఆర్టీసీ సమ్మె సమయంలో కేసీఆర్, కేటీఆర్‌లతో ఆర్టీసీ కార్యికుల సమస్యల గురించి చర్చిస్తానని ప్రకటించారు. కానీ ఆయనకు వారి అపాయింట్ మెంట్ లభించలేదు. ఆ తర్వాత ఆ విషయమే మర్చిపోయారు. అంతకు ముందు కేసీఆర్ టార్గెట్‌గా నల్లమల యురేనియం ప్రాజెక్ట్‌ను వ్యతిరేకిస్తూ పవన్ కళ్యాణ్ ఒక రౌండ్ టేబుల్ సమావేశం ఏర్పాటు చేశారు. కాని ఆ తర్వాత తెలంగాణ సమస్యలపై గళం విప్పిన సందర్భమే లేదు.

ఇలాంటి సమయంలో తిరిగి తెలంగాణలో ప్రతిపక్ష కూటమి ఏర్పాటు చేసే దిశగా ప్రయత్నాలు చేస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. తొలి అడుగుగా ఉస్మానియా యూనివర్సిటీ నుంచి ప్రారంభించాలని పవన్ భావిస్తున్నారు. జనసేన విద్యార్థి గర్జన పేరిట జనవరి 5న ఉస్మానియా క్యాంపస్‌లో ఒక బహిరంగ సభ ఏర్పాటు చేయనున్నారు. ఈ సభకు పవన్ కళ్యాణ్ వస్తారని విద్యార్థి నాయకులు వెల్లడించారు. తెలంగాణ ప్రభుత్వంపై తన పోరాటాన్ని అక్కడ నుంచే ప్రారంభిస్తారని సన్నిహిత వర్గాలు భావిస్తున్నారు.

నిరుగ్యోగ సమస్య, నోటిఫికేషన్లు వేయకపోవడం.. విద్యా వ్యవస్థను తెలంగాణ ప్రభుత్వం నిర్లక్ష్యం చేయడం వంటి అంశాలు అజెండాగా తన పోరాటాన్ని ప్రారంభించనున్నట్లు తెలుస్తోంది.

Tags:    
Advertisement

Similar News