ఉల్లి ధరలకు కేంద్ర ప్రభుత్వ వైఫల్యమే కారణం " సుబ్రమణ్యస్వామి

బీజేపీ ఎంపీ సుబ్రమణ్యస్వామి మరోసారి మోడీ ప్రభుత్వంపై ఘాటు వ్యాఖ్యలు చేశారు. దేశంలో నానాటికి దిగజారుతున్న ఆర్థిక పరిస్థితిపై ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. దేశంలో ఆర్ధిక పరిస్థితిపై ప్రధాని మోడీకి సరైన అవగాహన లేదని విమర్శించారు. ఉల్లిధరలపైనా హాట్ కామెంట్స్ చేశారు సుబ్రమణ్యస్వామి. దేశంలో 150 రూపాయలకు పైగా కిలో ఉల్లిధర ఉండడంపై ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. ఉల్లి ధరలు ఇలా పెరిగిపోవడానికి కారణం కేంద్ర ప్రభుత్వ వైఫల్యమేనని వ్యాఖ్యానించారు. కేంద్రం వద్ద సరైన […]

Advertisement
Update: 2019-12-09 00:25 GMT

బీజేపీ ఎంపీ సుబ్రమణ్యస్వామి మరోసారి మోడీ ప్రభుత్వంపై ఘాటు వ్యాఖ్యలు చేశారు. దేశంలో నానాటికి దిగజారుతున్న ఆర్థిక పరిస్థితిపై ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. దేశంలో ఆర్ధిక పరిస్థితిపై ప్రధాని మోడీకి సరైన అవగాహన లేదని విమర్శించారు.

ఉల్లిధరలపైనా హాట్ కామెంట్స్ చేశారు సుబ్రమణ్యస్వామి. దేశంలో 150 రూపాయలకు పైగా కిలో ఉల్లిధర ఉండడంపై ఆయన ఆందోళన వ్యక్తం చేశారు.

ఉల్లి ధరలు ఇలా పెరిగిపోవడానికి కారణం కేంద్ర ప్రభుత్వ వైఫల్యమేనని వ్యాఖ్యానించారు. కేంద్రం వద్ద సరైన ప్రణాళిక లేకపోవడం వల్లే ఉల్లి డిమాండ్ అమాంతం పెరిగిందని అభిప్రాయపడ్డారు.

పదేపదే చెన్నై పర్యటనకు వస్తున్న ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ను ఈ అంశంలో నిలదీయాలని ప్రజలకు సుబ్రమణ్యస్వామి సూచించారు. ఉల్లి ధరలపై ఇప్పటి వరకు ప్రధాని మోడీకి తాను ఆరు లేఖలు రాశానని చెప్పారు.

Tags:    
Advertisement

Similar News