పవన్‌ కల్యాణ్‌కు పోయేకాలం దగ్గరపడింది

మొన్నటి ఎన్నికల్లో వామపక్ష సిద్ధాంతాలు అంటే తనకు చాలా ఇష్టం, తాను చెగువేరా ఫాలోవర్‌ను అని చెప్పుకుని తిరిగిన పవన్ కల్యాణ్ ఇప్పుడు యూ టర్న్ తీసుకున్నారు. బీజేపీతో తాను ఎన్నడూ దూరంగా లేనని చెప్పారు. దాంతో వామపక్షాలు కంగుతిన్నాయి. పవన్ కల్యాణ్‌ తమకు వెన్నుపోటు పొడిచారన్న భావనతో వామపక్షాలున్నాయి. పవన్‌ తాజా వ్యాఖ్యలపై సీపీఎం ప్రధాన కార్యదర్శి మధు తీవ్రంగా స్పందించారు. పవన్‌ కల్యాణ్‌కు, జనసేనకు పోయేకాలం దాపురించే ఇలా మాట్లాడుతున్నారని విమర్శించారు. ఈ దేశానికి […]

Advertisement
Update: 2019-12-04 23:13 GMT

మొన్నటి ఎన్నికల్లో వామపక్ష సిద్ధాంతాలు అంటే తనకు చాలా ఇష్టం, తాను చెగువేరా ఫాలోవర్‌ను అని చెప్పుకుని తిరిగిన పవన్ కల్యాణ్ ఇప్పుడు యూ టర్న్ తీసుకున్నారు. బీజేపీతో తాను ఎన్నడూ దూరంగా లేనని చెప్పారు. దాంతో వామపక్షాలు కంగుతిన్నాయి.

పవన్ కల్యాణ్‌ తమకు వెన్నుపోటు పొడిచారన్న భావనతో వామపక్షాలున్నాయి. పవన్‌ తాజా వ్యాఖ్యలపై సీపీఎం ప్రధాన కార్యదర్శి మధు తీవ్రంగా స్పందించారు. పవన్‌ కల్యాణ్‌కు, జనసేనకు పోయేకాలం దాపురించే ఇలా మాట్లాడుతున్నారని విమర్శించారు.

ఈ దేశానికి అమిత్ షా లాంటి వారే కావాలంటూ పవన్ కల్యాణ్ వ్యాఖ్యానించడం ఆయన అవకాశవాదానికి నిదర్శనమని మధు వ్యాఖ్యానించారు. ప్రజల్లో మతం చిచ్చుపెట్టేందుకు బీజేపీ ప్రయత్నిస్తోందని… ఇప్పుడు జనసేన కూడా ఆ పనిలో చేరడం దారుణమన్నారు.

కులాలకు, మతాలకు అతీతంగా జనసేన పనిచేస్తుందని చెప్పిన పవన్ కల్యాణ్ ఇప్పుడు మతతత్వ వ్యాఖ్యలు చేయడం ఏమిటని ప్రశ్నించారు. మోడీ, అమిత్ షాలు ఉత్తరాది ఆధిపత్యాన్ని చెలాయిస్తున్నారని చెప్పిన పవన్ కల్యాణ్ ఇప్పుడెలా అమిత్ షాను పొడుగుతున్నారని నిలదీశారు.

Tags:    
Advertisement

Similar News