ధోనీ రిటైర్మెంట్ పై పెదవి విప్పిన దాదా

రిటైర్మెంట్ కు ఇంకా సమయం ఉందన్న సౌరవ్ భారత మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ రిటైర్మెంట్ పై బీసీసీఐ చైర్మన్ సౌరవ్ గంగూలీ తన మనసులోమాట బయటపెట్టాడు. ధోనీ రిటైర్మెంట్ కు ఇంకా సమయం రాలేదని.. రానున్నమూడుమాసాల కాలంలో ధోనీ భవితవ్యం తేలిపోనుందని చెప్పాడు. 2021 ఐపీఎల్ వరకూ ధోనీ క్రికెట్లో కొనసాగుతాడని భారత చీఫ్ కోచ్ రవిశాస్త్రి ప్రకటించడంతో ధోనీ రిటైర్మెంట్ ఇప్పుడే కాదని.. 2020 టీ-20 ప్రపంచకప్ కు ధోనీ అందుబాటులో ఉంటాడన్న సంకేతాలు బయటకు […]

Advertisement
Update: 2019-11-29 21:00 GMT
  • రిటైర్మెంట్ కు ఇంకా సమయం ఉందన్న సౌరవ్

భారత మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ రిటైర్మెంట్ పై బీసీసీఐ చైర్మన్ సౌరవ్ గంగూలీ తన మనసులోమాట బయటపెట్టాడు. ధోనీ రిటైర్మెంట్ కు ఇంకా సమయం రాలేదని.. రానున్నమూడుమాసాల కాలంలో ధోనీ భవితవ్యం తేలిపోనుందని చెప్పాడు.

2021 ఐపీఎల్ వరకూ ధోనీ క్రికెట్లో కొనసాగుతాడని భారత చీఫ్ కోచ్ రవిశాస్త్రి ప్రకటించడంతో ధోనీ రిటైర్మెంట్ ఇప్పుడే కాదని.. 2020 టీ-20 ప్రపంచకప్ కు ధోనీ అందుబాటులో ఉంటాడన్న సంకేతాలు బయటకు వచ్చాయి.

ఇంగ్లండ్ వేదికగా జరిగిన వన్డే ప్రపంచకప్ సెమీస్ తర్వాత నుంచి క్రికెట్ కు దూరంగా ఉంటూ వచ్చిన ధోనీ..ఇటీవలే రాంచీ వేదికగా తిరిగి ప్రాక్టీస్ ప్రారంభించాడు.

చెన్నై సూపర్ కింగ్స్ తరపున 2021 ఐపీఎల్ సీజన్ వరకూ ఆడనున్నాడని కూడా ఫ్రాంచైజీ వర్గాలు ప్రకటించాయి.

ఐపీఎల్ లో ధోనీ నిలకడగా రాణించడం ద్వారా ప్రపంచకప్ లో పాల్గొనే భారత టీ-20 జట్టులో చేరే అవకాశాలు లేకపోలేదు.

ఆస్ట్ర్రేలియాతో నవంబర్ లో జరిగే టీ-20 సిరీస్ లో సైతం ధోనీ పాల్గొనడం ఖాయంగా కనిపిస్తోంది.

భారత క్రికెట్ కు ధోనీ చేసిన సేవలు అపారమని…ఎప్పుడు..ఎలా రిటైర్ కావాలో ధోనీకే విడిచిపెడతామంటూ దాదా సౌరవ్ గంగూలీ గతంలోనే ప్రకటించిన సంగతి తెలిసిందే.

Tags:    
Advertisement

Similar News