మహా పరిణామాలపై పార్లమెంట్‌లో రగడ... బయట కాంగ్రెస్‌ ఆందోళన

మహారాష్ట్రలో తెల్లవారే సరికి రాష్ట్రపతి పాలన ఎత్తివేసి గుట్టుగా రాజ్‌భవన్‌లో సీఎం, డిప్యూటీ సీఎంలుగా పడ్నవీస్‌, అజిత్‌ పవార్‌తో ప్రమాణస్వీకారం చేయించడంపై పార్లమెంట్‌లో విపక్షాలు భగ్గుమన్నాయి. పార్లమెంట్ ఉభయసభల్లో కాంగ్రెస్‌తో పాటు పలు విపక్ష పార్టీలు ఆందోళనకు దిగాయి. మహారాష్ట్రలో ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేశారంటూ పోడియంను చుట్టుముట్టారు. కేంద్ర ప్రభుత్వం సమాధానం చెప్పాలని డిమాండ్ చేశాయి. గవర్నర్‌ బీజేపీ తొత్తుగా మారిపోయారని విపక్ష సభ్యులు ఆరోపించారు. పార్లమెంట్‌ బయట కాంగ్రెస్ అధినేత్రి సోనిమా గాంధీ నేతృత్వంలో కాంగ్రెస్ […]

Advertisement
Update: 2019-11-25 00:30 GMT

మహారాష్ట్రలో తెల్లవారే సరికి రాష్ట్రపతి పాలన ఎత్తివేసి గుట్టుగా రాజ్‌భవన్‌లో సీఎం, డిప్యూటీ సీఎంలుగా పడ్నవీస్‌, అజిత్‌ పవార్‌తో ప్రమాణస్వీకారం చేయించడంపై పార్లమెంట్‌లో విపక్షాలు భగ్గుమన్నాయి.

పార్లమెంట్ ఉభయసభల్లో కాంగ్రెస్‌తో పాటు పలు విపక్ష పార్టీలు ఆందోళనకు దిగాయి. మహారాష్ట్రలో ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేశారంటూ పోడియంను చుట్టుముట్టారు. కేంద్ర ప్రభుత్వం సమాధానం చెప్పాలని డిమాండ్ చేశాయి. గవర్నర్‌ బీజేపీ తొత్తుగా మారిపోయారని విపక్ష సభ్యులు ఆరోపించారు.

పార్లమెంట్‌ బయట కాంగ్రెస్ అధినేత్రి సోనిమా గాంధీ నేతృత్వంలో కాంగ్రెస్ నేతలు, పలు విపక్ష పార్టీల ఎంపీలు నిరసన ప్రదర్శన నిర్వహించారు. మహారాష్ట్ర సీఎంగా ఫడ్నవీస్ వెంటనే రాజీనామా చేయాలని… దేశానికి బీజేపీ క్షమాపణలు చెప్పాలని కాంగ్రెస్ సభ్యులు డిమాండ్ చేశారు.

Tags:    
Advertisement

Similar News