సిరీస్ విజయానికి చేరువగా భారత్

ఇన్నింగ్స్ ఓటమి అంచుల్లో బంగ్లాదేశ్ డే-నైట్ టెస్టులో విరాట్ సేన దూకుడు కోల్ కతా ఈడెన్ గార్డెన్స్ వేదికగా జరుగుతున్న డే-నైట్ టెస్టు మూడోరోజు ఆటలోనే ఆతిథ్య భారత్ ఇన్నింగ్స్ విజయానికి చేరువయ్యింది. 9వ ర్యాంకర్ బంగ్లాదేశ్ జట్టు ఇన్నింగ్స్ ఓటమి నుంచి బయటపడటానికి పోరాడుతోంది. తొలిఇన్నింగ్స్ లో కేవలం 106 పరుగులకే కుప్పకూలిన బంగ్లాజట్టు రెండో ఇన్నింగ్స్ లో రెండోరోజు ఆట ముగిసే సమయానికి 6 వికెట్లకు 152 పరుగులతో ఉంది. మిగిలిన ఆటలో మరో 84 […]

Advertisement
Update: 2019-11-23 22:42 GMT
  • ఇన్నింగ్స్ ఓటమి అంచుల్లో బంగ్లాదేశ్
  • డే-నైట్ టెస్టులో విరాట్ సేన దూకుడు

కోల్ కతా ఈడెన్ గార్డెన్స్ వేదికగా జరుగుతున్న డే-నైట్ టెస్టు మూడోరోజు ఆటలోనే ఆతిథ్య భారత్ ఇన్నింగ్స్ విజయానికి చేరువయ్యింది. 9వ ర్యాంకర్ బంగ్లాదేశ్ జట్టు ఇన్నింగ్స్ ఓటమి నుంచి బయటపడటానికి పోరాడుతోంది.

తొలిఇన్నింగ్స్ లో కేవలం 106 పరుగులకే కుప్పకూలిన బంగ్లాజట్టు రెండో ఇన్నింగ్స్ లో రెండోరోజు ఆట ముగిసే సమయానికి 6 వికెట్లకు 152 పరుగులతో ఉంది.

మిగిలిన ఆటలో మరో 84 పరుగులు సాధించగలిగితేనే బంగ్లాదేశ్ జట్టు ఇన్నింగ్స్ ఓటమి నుంచి బయటపడే అవకాశం ఉంది.

మాజీ కెప్టెన్ ముష్ ఫికుర్ రెహ్మాన్ 59 పరుగులతో ఒంటరిపోరాటం చేస్తూ క్రీజులో నిలిచాడు. బంగ్లా చేతిలో మరో నాలుగు వికెట్లు మాత్రమే మిగిలిఉన్నాయి.

భారత బౌలర్లలో ఇశాంత్ శర్మ 4 వికెట్లు, ఉమేశ్ యాదవ్ 2 వికెట్లు పడగొట్టారు.

ప్రస్తుత రెండుమ్యాచ్ ల సిరీస్ లో ఇప్పటికే 1-0 ఆధిక్యంతో ఉన్న భారత్ రెండోటెస్టులో సైతం నెగ్గడం ద్వారా సిరీస్ విజయాల హ్యాట్రిక్ తో పాటు… సొంతగడ్డపై వరుసగా 12 సిరీస్ విజయాలు సాధించిన తొలిజట్టుగా ప్రపంచ రికార్డు నెలకొల్పడానికి చేరువగా నిలిచింది.

Tags:    
Advertisement

Similar News