జగన్‌ నన్ను కుళ్లబొడిపించాడు... ఎస్పీపై చింతమనేని చిందులు

వివాదాస్పద మాజీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్‌ బెయిల్‌పై జైలు నుంచి బయటకు వచ్చాడు. పలు కేసుల్లో వరుసగా అరెస్ట్ అయిన చింతమనేని బెయిల్‌పై విడుదలైన వెంటనే ఊరేగింపు నిర్వహించాడు. అనంతరం మీడియాతో మాట్లాడిన చింతమనేని ప్రభాకర్… పోలీసుల చేత జగన్‌మోహన్ రెడ్డి తనను కుళ్ల బొడిపించారని ఆరోపించారు. ఏసుకు శిలువ వేసి పొడిచినట్టుగా తనను పొడిచారని చెప్పారు. పొడిచిన చోట పొడవకుండా కుళ్లబొడిచారని వివరించారు. మరోసారి తనపై బాణాలు వేయవద్దన్నారు. తాను ఆకులు రాలి మళ్లీ చిగురించేందుకు […]

Advertisement
Update: 2019-11-16 22:59 GMT

వివాదాస్పద మాజీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్‌ బెయిల్‌పై జైలు నుంచి బయటకు వచ్చాడు. పలు కేసుల్లో వరుసగా అరెస్ట్ అయిన చింతమనేని బెయిల్‌పై విడుదలైన వెంటనే ఊరేగింపు నిర్వహించాడు.

అనంతరం మీడియాతో మాట్లాడిన చింతమనేని ప్రభాకర్… పోలీసుల చేత జగన్‌మోహన్ రెడ్డి తనను కుళ్ల బొడిపించారని ఆరోపించారు. ఏసుకు శిలువ వేసి పొడిచినట్టుగా తనను పొడిచారని చెప్పారు. పొడిచిన చోట పొడవకుండా కుళ్లబొడిచారని వివరించారు.

మరోసారి తనపై బాణాలు వేయవద్దన్నారు. తాను ఆకులు రాలి మళ్లీ చిగురించేందుకు సిద్ధంగా ఉన్న చెట్టులాంటివాడినని… కాబట్టి బాణాలు వేసినా కాయలు రావన్నారు. అట్రాసిటీ చట్టాన్ని వృథా చేస్తున్నారని చింతమనేని ఆరోపించారు. మమ్మల్ని వెంటాడడమే ప్రభుత్వ ఉద్దేశం అయి ఉంటే ఆ విషయాన్ని ప్రభుత్వం ప్రజలకు వివరించాలన్నారు. అధికారం శాశ్వతం కాదన్న విషయం ప్రభుత్వం గుర్తించుకోవాలన్నారు.

పండుగ పూట ఆఫర్లు ఇచ్చినట్టుగా… చింతమనేని బాధితులంతా ముందుకు రండి న్యాయం చేస్తామంటూ జిల్లా ఎస్పీ పిలుపునివ్వడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు. చింతమనేనిపై కేసులు పెట్టిన వారికి ఎస్పీ, డీజీపీ న్యాయం చేయగలరా అని చింతమనేని సవాల్ చేశారు. తనను ఎవరూ ఓడించలేరని… చనిపోయే వరకు ఎమ్మెల్యేగా ఉంటానని తాను భావించానని చింతమనేని చెప్పారు.

Tags:    
Advertisement

Similar News