భారత్ వేదికగా హాకీ ప్రపంచకప్

2023 జనవరి 13 నుంచి 29 వరకూ టోర్నీ పురుషుల ప్రపంచకప్ హాకీ టోర్నీకి భారత్ మరోసారి వేదిక కానుంది. 2023 జనవరి 13 నుంచి 29 వరకూ జరిగే ప్రపంచకప్ పోటీలకు భారత్ ఆతిథ్యమిస్తుందని.. అంతర్జాతీయ హాకీ సమాఖ్య అధికారికంగా ప్రకటించింది. 2022లో జరిగే మహిళల ప్రపంచ హాకీ పోటీలకు స్పెయిన్, నెదర్లాండ్స్ దేశాలు సంయుక్తంగా ఆతిథ్యమివ్వనున్నాయి. ఆతిథ్య దేశం హోదాలో భారతజట్టు పురుషుల ప్రపంచకప్ లో నేరుగా పాల్గోనుంది. ఐదు ఖండాల టోర్నీలలో చాంపియన్లుగా […]

Advertisement
Update: 2019-11-08 23:04 GMT
  • 2023 జనవరి 13 నుంచి 29 వరకూ టోర్నీ

పురుషుల ప్రపంచకప్ హాకీ టోర్నీకి భారత్ మరోసారి వేదిక కానుంది. 2023 జనవరి 13 నుంచి 29 వరకూ జరిగే ప్రపంచకప్ పోటీలకు భారత్ ఆతిథ్యమిస్తుందని.. అంతర్జాతీయ హాకీ సమాఖ్య అధికారికంగా ప్రకటించింది.

2022లో జరిగే మహిళల ప్రపంచ హాకీ పోటీలకు స్పెయిన్, నెదర్లాండ్స్ దేశాలు సంయుక్తంగా ఆతిథ్యమివ్వనున్నాయి.

ఆతిథ్య దేశం హోదాలో భారతజట్టు పురుషుల ప్రపంచకప్ లో నేరుగా పాల్గోనుంది. ఐదు ఖండాల టోర్నీలలో చాంపియన్లుగా నిలిచిన జట్లు సైతం నేరుగా ప్రపంచకప్ ఫైనల్ రౌండ్లో పాల్గొంటాయి.

మిగిలిన 10 స్థానాల కోసం వివిధ దేశాల జట్లు డబుల్ లెగ్ క్వాలిఫైయింగ్ పోటీలలో తలపడాల్సి ఉంది.

టోక్యో ఒలింపిక్స్ ముగిసిన వెంటనే తాజాగా ర్యాంకింగ్స్ ను అంతర్జాతీయ హాకీ సమాఖ్య ఖరారు చేయనుంది. ర్యాంకింగ్స్ ఆధారంగానే ప్రపంచకప్ అర్హత పోటీలలో పాల్గొనే వీలుంది.

Tags:    
Advertisement

Similar News