రమణ దీక్షితులకు జగన్ గ్రీన్ సిగ్నల్

ఎల్‌వీ సుబ్రమణ్యంపై బదిలీ వేటు తర్వాత జగన్‌ మోహన్ రెడ్డి ప్రభుత్వం మరో కీలక నిర్ణయం దిశగా అడుగులేస్తోంది. చంద్రబాబు హయాంలో అవమానకరంగా తొలగించబడిన టీటీడీ ప్రధానార్చకుడు రమణదీక్షితులు తిరిగి శ్రీవారి సేవకు రాబోతున్నారు. సీఎం జగన్ మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు రమణదీక్షితులు ఆలయ ప్రవేశానికి టీటీడీ అంగీకరించబోతోంది. ప్రస్తుతానికి రమణదీక్షితులను ఆగమ సలహాదారుడిగా నియమించబోతున్నారు. నూతన అర్చకులకు మార్గదర్శకుడిగా రమణ దీక్షితులు సేవలు వినియోగించుకోవాలని సీఎం ఆదేశించారు. అర్చకత్వ వ్యవహారం కోర్టులో ఉన్నందున … […]

Advertisement
Update: 2019-11-05 08:53 GMT

ఎల్‌వీ సుబ్రమణ్యంపై బదిలీ వేటు తర్వాత జగన్‌ మోహన్ రెడ్డి ప్రభుత్వం మరో కీలక నిర్ణయం దిశగా అడుగులేస్తోంది. చంద్రబాబు హయాంలో అవమానకరంగా తొలగించబడిన టీటీడీ ప్రధానార్చకుడు రమణదీక్షితులు తిరిగి శ్రీవారి సేవకు రాబోతున్నారు. సీఎం జగన్ మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు రమణదీక్షితులు ఆలయ ప్రవేశానికి టీటీడీ అంగీకరించబోతోంది.

ప్రస్తుతానికి రమణదీక్షితులను ఆగమ సలహాదారుడిగా నియమించబోతున్నారు. నూతన అర్చకులకు మార్గదర్శకుడిగా రమణ దీక్షితులు సేవలు వినియోగించుకోవాలని సీఎం ఆదేశించారు. అర్చకత్వ వ్యవహారం కోర్టులో ఉన్నందున … ఆ కేసు పరిష్కారం అయిన తర్వాత అర్చకత్వ బాధ్యతలను రమణ దీక్షితులకు అప్పగించనున్నారు.

తనను చంద్రబాబు ప్రభుత్వం అవమానకరంగా ప్రధానార్చక పదవి నుంచి తొలగించిన తర్వాత … నాటి ప్రతిపక్ష నేత వైఎస్ జగన్‌ను కలిసి తనకు జరిగిన అన్యాయాన్ని రమణదీక్షితులు వివరించారు. ఆ సమయంలో వైసీపీ అధికారంలోకి రాగానే తిరిగి అర్చకత్వ బాధ్యతలు అప్పగిస్తామని జగన్‌ హామీ ఇచ్చారు.

Tags:    
Advertisement

Similar News