బాబు హయాంలో అలా... ఇప్పుడు ఇలా...

రైతు భరోసాపై జనసేన అధ్యక్షుడు పవన్‌ కల్యాణ్ విమర్శలు చేశారు. రైతు భరోసా కింద ఒక్కో రైతుకు 18వేల 500 చెల్లించాలని డిమాండ్ చేశారు. ఎన్నికల సమయంలో 12500 ఇస్తామని జగన్ చెప్పారని… ఇప్పుడు కేంద్రం ఇచ్చే సొమ్మును కూడా కలిపి 18,500 ఇవ్వాలని డిమాండ్ చేశారు. 12,500 ఒకేసారి ఎందుకు ఇవ్వడం లేదో చెప్పాలని డిమాండ్ చేశారు. అలా ఒకేసారి ఇవ్వలేనందుకు క్షమాపణ చెప్పాలని పవన్ కల్యాణ్ డిమాండ్ చేశారు. ఆర్థిక ఇబ్బందుల కారణంగా ప్రభుత్వం […]

Advertisement
Update: 2019-10-15 22:43 GMT

రైతు భరోసాపై జనసేన అధ్యక్షుడు పవన్‌ కల్యాణ్ విమర్శలు చేశారు. రైతు భరోసా కింద ఒక్కో రైతుకు 18వేల 500 చెల్లించాలని డిమాండ్ చేశారు. ఎన్నికల సమయంలో 12500 ఇస్తామని జగన్ చెప్పారని… ఇప్పుడు కేంద్రం ఇచ్చే సొమ్మును కూడా కలిపి 18,500 ఇవ్వాలని డిమాండ్ చేశారు.

12,500 ఒకేసారి ఎందుకు ఇవ్వడం లేదో చెప్పాలని డిమాండ్ చేశారు. అలా ఒకేసారి ఇవ్వలేనందుకు క్షమాపణ చెప్పాలని పవన్ కల్యాణ్ డిమాండ్ చేశారు. ఆర్థిక ఇబ్బందుల కారణంగా ప్రభుత్వం విడతల్లో ఇవ్వడాన్ని పవన్ కల్యాణ్ ఇప్పుడు తప్పుపట్టారు గానీ… చంద్రబాబు హయాంలో ఇదే పరిస్థితి వస్తే మాత్రం అప్పుడు పవన్‌ కల్యాణే చొరవ తీసుకుని బాబును సమర్ధించారు.

చంద్రబాబు పూర్తి స్థాయిలో రుణమాఫీ చేస్తామని ఎన్నికలకు ముందు చెప్పారని…ఆయనకు అది చేయాలని ఉన్నా ఆర్థిక పరిస్థితులు అనుకూలించలేదని పవన్‌ కల్యాణ్ అప్పట్లో చంద్రబాబుకు అండగా నిలిచారు. రుణమాఫీని చంద్రబాబు దాదాపు అట్టకెక్కించినా, ఎన్నికల సమయంలో మూడు వేల చెప్పున అకౌంట్లలో వేసినా పవన్‌ కల్యాణ్ అదేంటి అని మాత్రం ప్రశ్నించలేదు.

చంద్రబాబు ఐదేళ్లలో చేసిన అప్పులు, దానికి తోడు 60వేల కోట్ల పెండింగ్ బిల్లులు ఉన్న నేపథ్యంలో…. కొత్త ప్రభుత్వం కిందా మీద పడుతుంటే పవన్ కల్యాణ్‌ మాత్రం దాన్ని పరిగణనలోకి తీసుకోవడానికి ఇష్టపడడం లేదు. రైతు భరోసా కింద ఏకంగా 18,500 చెల్లించాల్సిందేనని డిమాండ్ చేస్తున్నారు.

Tags:    
Advertisement

Similar News