ప్రియమణికి మరో చక్కని దారి దొరికింది

ఎవరు ఔనన్నా కాదన్నా పెళ్లయిన హీరోయిన్లకు తిరిగి అవకాశాలు రావడం కాస్త కష్టమే. ఒకవేళ అవకాశం వచ్చినా క్రేజ్ తెచ్చుకోవడం చాలా కష్టం. ఉన్నంతలో కెరీర్ ను నెట్టుకుంటూ వస్తుంటారు. కానీ ప్రియమణి కెరీర్ మాత్రం దీనికి అతీతం. పెళ్లయి సెకెండ్ ఇన్నింగ్స్ ప్రారంభించిన ఈ బ్యూటీ, ఇప్పుడు మరోసారి దూసుకుపోతోంది. మరీ ముఖ్యంగా వెబ్ సిరీస్ కాన్సెప్ట్ ప్రియమణికి అనుకోని వరంగా మారింది. అమెజాన్ ప్రైమ్ వీడియోస్ లో రీసెంట్ గా వచ్చిన వెబ్ సిరీస్ […]

Advertisement
Update: 2019-10-02 21:16 GMT

ఎవరు ఔనన్నా కాదన్నా పెళ్లయిన హీరోయిన్లకు తిరిగి అవకాశాలు రావడం కాస్త కష్టమే. ఒకవేళ అవకాశం వచ్చినా క్రేజ్ తెచ్చుకోవడం చాలా కష్టం. ఉన్నంతలో కెరీర్ ను నెట్టుకుంటూ వస్తుంటారు. కానీ ప్రియమణి కెరీర్ మాత్రం దీనికి అతీతం. పెళ్లయి సెకెండ్ ఇన్నింగ్స్ ప్రారంభించిన ఈ బ్యూటీ, ఇప్పుడు మరోసారి దూసుకుపోతోంది. మరీ ముఖ్యంగా వెబ్ సిరీస్ కాన్సెప్ట్ ప్రియమణికి అనుకోని వరంగా మారింది.

అమెజాన్ ప్రైమ్ వీడియోస్ లో రీసెంట్ గా వచ్చిన వెబ్ సిరీస్ ‘ది ఫ్యామిలీ మ్యాన్’. మనోజ్ బాజ్ పాయ్ హీరోగా నటించిన ఈ సిరీస్, ప్రియమణికి ఎనలేని క్రేజ్ తీసుకొచ్చింది. సిరీస్ సూపర్ హిట్ అవ్వడంతో ప్రియమణికి మళ్లీ ఆఫర్లు క్యూ కడుతున్నాయి. దీంతో ఆమె ఉబ్బితబ్బిబ్బవుతోంది.

నిజానికి హీరోయిన్లు వెబ్ సిరీసుల్లో నటించడం తక్కువ. ఒకవేళ నటించినా వాళ్లకు పేరొచ్చిన సందర్భాలు కూడా తక్కువ. ప్రియమణి విషయంలో మాత్రం ఇది తప్పని రుజువైంది. ది ఫ్యామిలీ మ్యాన్ సిరీస్ కు వచ్చిన ఆదరణ చూసిన సోనీ సంస్థ.. ప్రియమణితో ఓ భారీ డీల్ కుదుర్చుకోవడానికి రెడీ అవుతోంది. అందులో ప్రియమణిదే లీడ్ రోల్.

Tags:    
Advertisement

Similar News