సౌతాఫ్రికాపై వెయ్యి పరుగులకు 242 పరుగుల దూరంలో కొహ్లీ

సఫారీలపై వెయ్యి పరుగుల మొనగాళ్లు సచిన్, ద్రావిడ్, వీరూ సౌతాఫ్రికా ప్రత్యర్థిగా టెస్ట్ క్రికెట్లో వెయ్యి పరుగుల మైలురాయి చేరడానికి…భారత కెప్టెన్ విరాట్ కొహ్లీ తహతహలాడుతున్నాడు. సఫారీలపై ఇప్పటికే 1000 పరుగులు సాధించిన మాస్టర్ సచిన్ టెండుల్కర్,వీరేంద్ర సెహ్వాగ్, రాహుల్ ద్రావిడ్ ల సరసన చోటు కోసం ఎదురు చూస్తున్నాడు. సౌతాఫ్రికాతో ప్రారంభమయ్యే ప్రస్తుత తీన్మార్ టెస్టు సిరీస్ లో కొహ్లీ మరో 242 పరుగులు సాధించగలిగితే..వెయ్యి పరుగుల రికార్డును అందుకోగలుగుతాడు. సఫారీలపై 9 టెస్టుల్లో 758 పరుగులు […]

Advertisement
Update: 2019-10-02 00:32 GMT
  • సఫారీలపై వెయ్యి పరుగుల మొనగాళ్లు సచిన్, ద్రావిడ్, వీరూ

సౌతాఫ్రికా ప్రత్యర్థిగా టెస్ట్ క్రికెట్లో వెయ్యి పరుగుల మైలురాయి చేరడానికి…భారత కెప్టెన్ విరాట్ కొహ్లీ తహతహలాడుతున్నాడు. సఫారీలపై ఇప్పటికే 1000 పరుగులు సాధించిన మాస్టర్ సచిన్ టెండుల్కర్,వీరేంద్ర సెహ్వాగ్, రాహుల్ ద్రావిడ్ ల సరసన చోటు కోసం ఎదురు చూస్తున్నాడు.

సౌతాఫ్రికాతో ప్రారంభమయ్యే ప్రస్తుత తీన్మార్ టెస్టు సిరీస్ లో కొహ్లీ మరో 242 పరుగులు సాధించగలిగితే..వెయ్యి పరుగుల రికార్డును అందుకోగలుగుతాడు.

సఫారీలపై 9 టెస్టుల్లో 758 పరుగులు

సఫారీలపై తన కెరియర్ లో ఇప్పటి వరకూ ఆడిన 9 టెస్టులు, 16 ఇన్నింగ్స్ లో కొహ్లీ 758 పరుగులతో 47.37 సగటు నమోదు చేశాడు. ఇందులో రెండు సెంచరీలు, మూడు హాఫ్ సెంచరీలు ఉన్నాయి.

ప్రస్తుత సిరీస్ లో కొహ్లీ వెయ్యి పరుగుల మైలురాయిని చేరగలిగితే…ఈ ఘనత సాధించిన భారత నాలుగో క్రికెటర్ కాగలుగుతాడు.

సచిన్ దే అగ్రస్థానం…

సౌతాఫ్రికా ప్రత్యర్థిగా తన కెరియర్ లో 25 టెస్టులు ఆడిన మాస్టర్ సచిన్ టెండుల్కర్..45 ఇన్నింగ్స్ లో 1741 పరుగులు సాధించాడు. ఇందులో 7 సెంచరీలు, 5 హాఫ్ సెంచరీలు..42. 46 సగటు సైతం ఉన్నాయి.

ఇక…వీరబాదుడు ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్ కేవలం 15 టెస్టులు, 26 ఇన్నింగ్స్ లో 1306 పరుగులు సాధించాడు. ఓ ట్రిపుల్ సెంచరీతో సహా మొత్తం 5 శతకాలు, 2 అర్థ శతకాలు బాదాడు. 50.23 సగటు సైతం నమోదు చేశాడు.

ఇండియన్ క్రికెట్ వాల్ రాహుల్ ద్రావిడ్ 21 టెస్టులు, 40 ఇన్నింగ్స్ లో 1252 పరుగులు సాధించాడు. 2 సెంచరీలు, 5 హాఫ్ సెంచరీలతో 33. 38 సగటు నమోదు చేశాడు.

వీవీఎస్ లక్ష్మణ్ 976, సౌరవ్ గంగూలీ 947, మహ్మద్ అజరుద్దీన్ 779 పరుగులు సాధించారు.

Tags:    
Advertisement

Similar News