అవును.. నేను ఐటెంసాంగ్ చేస్తున్నాను

మహేష్ నటిస్తున్న సరిలేరు నీకెవ్వరు సినిమాలో తమన్న ఐటెంసాంగ్ చేయబోతోందంటూ కొన్ని రోజులుగా ప్రచారం సాగుతోంది. దీన్ని తమన్న నిర్థారించింది. మహేష్ సినిమాలో తను ఐటెంసాంగ్ చేయబోతున్నట్టు తెలిపింది. దీనికి ఒక కారణం అనీల్ రావిపూడి అయితే, మరో కారణం మహేష్ బాబు అంటోంది తమన్న. “నేను ఈ స్పెషల్ సాంగ్ కు ఒప్పుకోవడానికి కారణం అనీల్ రావిపూడి. ఎఫ్2 సినిమాతో అనీల్ నాకు హిట్ ఇచ్చారు. సరిలేరు నీకెవ్వరు సినిమాలో ఓ స్పెషల్ సాంగ్ ఉంది […]

Advertisement
Update: 2019-09-30 03:08 GMT

మహేష్ నటిస్తున్న సరిలేరు నీకెవ్వరు సినిమాలో తమన్న ఐటెంసాంగ్ చేయబోతోందంటూ కొన్ని రోజులుగా ప్రచారం సాగుతోంది. దీన్ని తమన్న నిర్థారించింది. మహేష్ సినిమాలో తను ఐటెంసాంగ్ చేయబోతున్నట్టు తెలిపింది. దీనికి ఒక కారణం అనీల్ రావిపూడి అయితే, మరో కారణం మహేష్ బాబు అంటోంది తమన్న.

“నేను ఈ స్పెషల్ సాంగ్ కు ఒప్పుకోవడానికి కారణం అనీల్ రావిపూడి. ఎఫ్2 సినిమాతో అనీల్ నాకు హిట్ ఇచ్చారు. సరిలేరు నీకెవ్వరు సినిమాలో ఓ స్పెషల్ సాంగ్ ఉంది చేస్తావా అని అడిగారు. వెంటనే ఓకే చెప్పాను. ఎందుకంటే అడిగింది అనీల్ రావిపూడి, పైగా ఆ సాంగ్ లో నేను డాన్స్ చేయబోయేది మహేష్ బాబుతో. మహేష్ ను కలిసి చాలా రోజులైంది. అందుకే వెంటనే ఒప్పుకున్నాను.”

ఇలా సరిలేరు నీకెవ్వరు సినిమాలో సాంగ్ చేయబోతున్న విషయాన్ని తమన్న నిర్థారించింది. ఈ సాంగ్ కోసం రామోజీ ఫిలింసిటీలో భారీ సెట్ నిర్మిస్తున్నారు. ప్రస్తుతం తమన్న సైరా సినిమా ప్రచారంలో బిజీగా ఉంది. ఆ సినిమా థియేటర్లలోకి వచ్చిన వెంటనే మహేష్ తో కలిసి స్పెషల్ సాంగ్ షూటింగ్ లో పాల్గొంటుంది. సంక్రాంతి కానుకగా జనవరి 11న థియేటర్లలోకి వస్తుంది సరిలేరు నీకెవ్వరు సినిమా.

Tags:    
Advertisement

Similar News