ప్రభాస్ నెగటివ్ కామెంట్స్.... కాజల్ పాజిటివ్ రిప్లై

ఇటీవలే సాహో సినిమా కి సంబందించిన ప్రమోషన్స్ లో భాగం గా ప్రభాస్ చాలా ఇంటర్వ్యూలు ఇచ్చాడు. ఎన్నో విషయాలపై ముచ్చటించాడు. ఆ క్రమం లో కొంత మంది కాజల్ అగర్వాల్ గురించి అడగగా ప్రభాస్ కొంచెం వెరైటీ గా ఆన్సర్ చేసి అందరిని ఆకర్షించాడు. అప్పట్లో ప్రభాస్ మాట్లాడుతూ… “కాజల్ అగర్వాల్ చాలా అందం గా ఉంటుంది… కానీ ఆమె డ్రెస్సింగ్ సెన్స్ మాత్రం బాగోదు. మొదట్లో తన డ్రెస్సింగ్ సెన్స్ అస్సలు మంచిగా ఉండేది […]

Advertisement
Update: 2019-09-16 20:53 GMT

ఇటీవలే సాహో సినిమా కి సంబందించిన ప్రమోషన్స్ లో భాగం గా ప్రభాస్ చాలా ఇంటర్వ్యూలు ఇచ్చాడు. ఎన్నో విషయాలపై ముచ్చటించాడు. ఆ క్రమం లో కొంత మంది కాజల్ అగర్వాల్ గురించి అడగగా ప్రభాస్ కొంచెం వెరైటీ గా ఆన్సర్ చేసి అందరిని ఆకర్షించాడు.

అప్పట్లో ప్రభాస్ మాట్లాడుతూ… “కాజల్ అగర్వాల్ చాలా అందం గా ఉంటుంది… కానీ ఆమె డ్రెస్సింగ్ సెన్స్ మాత్రం బాగోదు. మొదట్లో తన డ్రెస్సింగ్ సెన్స్ అస్సలు మంచిగా ఉండేది కాదు… కానీ ఇప్పుడు మాత్రం చాలా నేర్చుకుంది” అని ప్రభాస్ అన్నాడు. ఈ కామెంట్స్ సోషల్ మీడియాలో చాలా వైరల్ అయ్యాయి. కాజల్ రెస్పాండ్ అవుతుంది అని కొందరు భావించారు… కానీ అది జరుగలేదు.

ఇకపోతే పదిహేను రోజుల తర్వాత ఇప్పుడు తాజాగా కాజల్ ప్రభాస్ గురించి కొన్ని ఆసక్తికర కామెంట్స్ చేసింది. కాకపోతే ప్రభాస్ లాగ కాకుండా కొంచెం పాజిటివ్ గా మాట్లాడింది కాజల్. ఒక ఐరన్ మాన్ మరియు హల్క్ కలిస్తే ఎలా ఉంటుందో ప్రభాస్ అలా ఉంటాడు అని చెప్పింది. ఇది విన్న వాళ్ళందరూ కాజల్ స్పోర్టివ్ స్పిరిట్ గురించి పొగుడుతున్నారు.

Tags:    
Advertisement

Similar News