కృష్ణమ్మకు మళ్లీ వరద వస్తోంది బాబు...

కృష్ణా నదికి మళ్లీ భారీ వరద మొదలైంది. ఆగస్ట్‌లో రోజుకు 8లక్షల క్కూసెక్కుల మేర వరద రావడంతో ప్రాజెక్టులన్నీ ఇప్పటికే నిండిపోయాయి. అమరావతి ప్రాంతంలో లోతట్టు ప్రాంతాలు మునిగాయి. ఇప్పుడు మరోసారి ఎగువ నుంచి భారీగా వరద మొదలైంది. ఎగువ రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురుస్తుండడంతో తుంగభద్ర, కృష్ణా నదులకు భారీగా వరద వస్తోంది. శుక్రవారం సాయంత్రానికి శ్రీశైలానికి లక్ష క్యూసెక్కులకు పైగా వరద వస్తోంది. ఇప్పటికే ఆల్మట్టి, నారాయణపూర్, తుంగభద్ర, ఉజ్జయిని ప్రాజెక్టులు నిండిపోవడంతో వచ్చిన […]

Advertisement
Update: 2019-09-06 20:47 GMT

కృష్ణా నదికి మళ్లీ భారీ వరద మొదలైంది. ఆగస్ట్‌లో రోజుకు 8లక్షల క్కూసెక్కుల మేర వరద రావడంతో ప్రాజెక్టులన్నీ ఇప్పటికే నిండిపోయాయి. అమరావతి ప్రాంతంలో లోతట్టు ప్రాంతాలు మునిగాయి. ఇప్పుడు మరోసారి ఎగువ నుంచి భారీగా వరద మొదలైంది. ఎగువ రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురుస్తుండడంతో తుంగభద్ర, కృష్ణా నదులకు భారీగా వరద వస్తోంది. శుక్రవారం సాయంత్రానికి శ్రీశైలానికి లక్ష క్యూసెక్కులకు పైగా వరద వస్తోంది.

ఇప్పటికే ఆల్మట్టి, నారాయణపూర్, తుంగభద్ర, ఉజ్జయిని ప్రాజెక్టులు నిండిపోవడంతో వచ్చిన నీటిని వచ్చినట్టు దిగువకు వదులుతున్నారు. వరద మరింత పెరిగే అవకాశం ఉందని భావిస్తున్నారు.

ఎగువన ఇంకా వర్షాలు కురిస్తే భారీ వరద ఖాయమని అంచనా వేస్తున్నారు. శ్రీశైలం ప్రాజెక్టు నుంచి పోతిరెడ్డిపాడు హెడ్‌ రెగ్యులేటర్, హంద్రీ-నీవా, కల్వకుర్తి, విద్యుదుత్పత్తి కేంద్రాల ద్వారా 95వేల క్కూసెక్కుల నీటిని బయటకు వదులుతున్నారు. తుంగభద్ర నుంచి 85 వేల క్కూసెక్కుల నీరు వస్తోంది. కృష్ణా డెల్టాకు 16వేల క్కూసెక్కుల నీటిని వదులుతున్నారు.

ప్రాజెక్టులన్నీ నిండి ఉండడం, ఎగువన భారీ వర్షాలు కురుస్తుండడంతో అధికారులు అప్రమత్తమయ్యారు. ఎప్పటికప్పుడు వరద పరిస్థితిని పరిశీలిస్తున్నారు. వరద పెరిగితే మరోసారి ఏపీలో దిగువ ప్రాంతంలో వారు అప్రమత్తం కావాల్సి ఉంటుంది.

Tags:    
Advertisement

Similar News