బీజేపీలోకి మాజీ మంత్రి ఆదినారాయణ రెడ్డి?

ఏపీ మాజీ మంత్రి ఆదినారాయణ రెడ్డి పార్టీ మారే యోచనలో ఉన్నారు. గత ఎన్నికల్లో టీడీపీ తరపున పోటీ చేసిన ఆయన ఓటమి పాలయ్యారు. అంతే కాకుండా టీడీపీ కూడా అధికారంలోకి రాలేక 23 సీట్లకే పరిమితం కావడంతో పలువురు నేతలు తమ రాజకీయ భవిష్యత్ కోసం పలు మార్గాలు అన్వేషిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఆదినారాయణ రెడ్డి పార్టీ మారతారని గత కొన్ని రోజులుగా ప్రచారం జరుగుతోంది. కాగా, ఆయన ఇవాళ బీజేపీ కార్యనిర్వాహక అధ్యక్షుడు జేపీ […]

Advertisement
Update: 2019-08-19 00:24 GMT

ఏపీ మాజీ మంత్రి ఆదినారాయణ రెడ్డి పార్టీ మారే యోచనలో ఉన్నారు. గత ఎన్నికల్లో టీడీపీ తరపున పోటీ చేసిన ఆయన ఓటమి పాలయ్యారు. అంతే కాకుండా టీడీపీ కూడా అధికారంలోకి రాలేక 23 సీట్లకే పరిమితం కావడంతో పలువురు నేతలు తమ రాజకీయ భవిష్యత్ కోసం పలు మార్గాలు అన్వేషిస్తున్నారు.

ఈ నేపథ్యంలో ఆదినారాయణ రెడ్డి పార్టీ మారతారని గత కొన్ని రోజులుగా ప్రచారం జరుగుతోంది. కాగా, ఆయన ఇవాళ బీజేపీ కార్యనిర్వాహక అధ్యక్షుడు జేపీ నడ్డాను హైదరాబాద్‌లో కలిశారు. దీంతో ఆయన బీజేపీలో చేరడం ఖాయమని రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది.

మరోవైపు బీజేపీలో చేరితే ఏపీ పార్టీ కార్యవర్గంలో ఆయనకు కీలక పదవి ఇచ్చే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. రాయలసీమ ప్రాంతంలో తనకు ఉన్న పరిచయాలు, బలాల గురించి నడ్డాకు వివరించినట్లు సమాచారం. పార్టీని రాయలసీమలోని నాలుగు జిల్లాల్లో విస్తరించడానికి తాను సిద్దంగా ఉన్నట్లు ఆదినారాయణ రెడ్డి హామీ ఇచ్చారట.

దీంతో త్వరలోనే రాయలసీమలో ఒక భారీ బహిరంగ సభ ఏర్పాటు చేసి తన అనుచరగణంతో పార్టీలో చేరేందుకు ఆదినారాయణ రంగం సిద్దం చేసుకుంటున్నారు.

ఒక వేళ బీజేపీ కేంద్ర అధిష్టానం బహిరంగ సభకు ఒప్పుకోకుంటే ఢిల్లీలో ప్రధాని, హోంమంత్రి సమక్షంలో చేరాలని ఆయన ఆశిస్తున్నారు.

Tags:    
Advertisement

Similar News