సరిలేరు నీకెవ్వరు..... ఇంట్రో....

‘మహర్షి’ సినిమాతో మంచి హిట్ అందుకున్న టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు ఇప్పుడు అనిల్ రావిపూడి దర్శకత్వంలో ‘సరిలేరు నీకెవ్వరు’ అనే సినిమాతో త్వరలో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. రష్మీక మందన్న హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాలో విజయశాంతి, ఆది పినిశెట్టి, సంగీత, వెన్నెల కిషోర్, ప్రకాష్ రాజ్, రమ్య కృష్ణ తదితరులు ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. ప్రమోషల్ మెటీరియల్ తో సినిమాపై మంచి అంచనాలు ఏర్పరిచారు. తాజాగా మహేష్ పుట్టిన రోజు సందర్భంగా […]

Advertisement
Update: 2019-08-08 22:49 GMT

‘మహర్షి’ సినిమాతో మంచి హిట్ అందుకున్న టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు ఇప్పుడు అనిల్ రావిపూడి దర్శకత్వంలో ‘సరిలేరు నీకెవ్వరు’ అనే సినిమాతో త్వరలో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. రష్మీక మందన్న హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాలో విజయశాంతి, ఆది పినిశెట్టి, సంగీత, వెన్నెల కిషోర్, ప్రకాష్ రాజ్, రమ్య కృష్ణ తదితరులు ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు.

ప్రమోషల్ మెటీరియల్ తో సినిమాపై మంచి అంచనాలు ఏర్పరిచారు. తాజాగా మహేష్ పుట్టిన రోజు సందర్భంగా ఈ చిత్రానికి సంబంధించిన ఫస్ట్ లుక్ ఇంట్రో వీడియోని విడుదల చేశారు.

ఈ ఇంట్రో వీడియో లో మహేష్ బాబు ఆర్మీ మేజర్ అవతారంలో కనిపిస్తున్నాడు. ఇంతకుముందు నటించిన సినిమాలతో పోలిస్తే మహేష్ బాబు ఈ సినిమాలో ఒక సరికొత్త లుక్ తో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడని ఈ ఇంట్రో వీడియో చూస్తేనే అర్థమవుతుంది.

ఇంట్రో వీడియోతోనే సినిమాపై అంచనాలను భారీగా ప్లాన్ చేస్తున్నారు దర్శక నిర్మాతలు. దిల్ రాజు మరియు రామబ్రహ్మం సుంకర సంయుక్తంగా ఈ సినిమాని నిర్మిస్తున్నారు. దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్న ఈ సినిమా వచ్చే ఏడాది విడుదల కాబోతుంది.

Happy Birthday Super Star Mahesh Babu Here is the Surprise for SuperStar Fans #SarileruNeekevvaru THE INTRO Major Ajay Krishna reporting for duty…⚡️?youtu.be/YaCGtGfoI1Q#HappyBirthdaySSMB

Posted by Sri Venkateswara Creations on Thursday, 8 August 2019

Tags:    
Advertisement

Similar News